ఎదులాపురం, అక్టోబర్ 22 : ఆయుధాలు, బాంబ్ స్కాడ్, కమ్యూనికేషన్ వ్యవస్థ, ఫింగర్ ప్రింట్ పనితీరు, డాగ్ స్కాడ్ పనితీరుపై విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమం విజయవంతమైందని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్‌కుమార్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల దినం సందర్భంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో శనివారం జిల్లాలోని 133 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఓపెన్ హౌస్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పోలీసుల ద్వారా వినియోగిస్తున్న వివిధ రకాల ఆయుధాలు, వాటి మందు గుండు సామగ్రి, దేశ విదేశాలకు చెందిన అత్యాధునిక ఆయుధాలు, బాంబులు వాటి పనితీరు, తయారు చేసిన సంవత్సరం, వాటి పేర్లు తదితర అంశాలపై ప్రాథమికంగా అవగాహన కల్పించారు. అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ ఉపయోగించే వేరీ హై ఫ్రీక్వెన్సీసెట్లు, శాటిలైట్ ఫోన్స్ తదితర విషయాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, డీఎస్పీ వీ ఉమేందర్, సీఐలు పీ సురేందర్, కే శ్రీధర్, కే మల్లేశ్, జే కృష్ణమూర్తి, ఆర్ఐ సీఐ డీ వెంకటి, బీ శ్రీపాల్ తదితరులు పాల్గొన్నారు.
‘రోడ్డు ప్రమాదాల నివారణలో పౌరుల పా త్ర’ అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో ఐదోతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న.., ‘సైబర్ క్రైమ్ నివారించేందుకు పోలీసులు, పౌరుల పాత్ర’ అనే అంశంపై వ్యాస ర చన పోటీల్లో ఇంటర్మీడియట్ ఆపై చదువుతు న్న విద్యార్థులు పాల్గొనాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో వ్యాసరం రాయవచ్చని పేర్కొన్నారు. వెబ్సైట్ https:// forms. gle/y5kk13 WkPQYvgfW16 ద్వారా సమర్పించాలని సూచించారు.