ఇంద్రవెల్లి, అక్టోబర్ 22 : ఆటాపాటలతో గిరిజన గూడేలు మార్మోగుతున్నాయి. దండారీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో శనివారం నార్నూర్ మండలంలోని మన్నాపూ ర్ గ్రామానికి చెందిన గుస్సాడీలతో పాటు మండలంలో ని మెండపల్లి గ్రామానికి చెందిన గుస్సాడీ బృందం సభ్యులు ఆదివాసీ గిరిజన సంప్రదాయం ప్రకారం ప్ర త్యేక పూజలు చేశారు. దేవికి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో దండారీ ఉత్సవాలు ని ర్వహించారు. బృందం సభ్యులు, మహిళలు, పురుషులు వేర్వేరుగా దండారీ పాటలపై ఆడారు. ఆలయ ఆవరణ లో వంటలు చేసి, సహపంక్తి భోజనాలు చేశారు.
ఆదివాసీ గిరిజనులు ఇతర గ్రామాలకు చెందిన దం డారీ బృందాలను తమ గ్రామాలకు ఆహ్వానించి వారికి అతిథి మర్యాదలు చేస్తున్నారు. మండలంలోని వాల్గొం డ గ్రామపంచాయతీ పరిధిలోని పొల్లుగూడలో శుక్రవారం రాత్రి దండారీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన గుస్సాడీ బృందం మండలంలోని పొల్లుగూడకు వచ్చింది. గ్రామస్తులు సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ వారికి ఘన స్వాగతం పలికారు. అతిథి మర్యాదలు చేశారు. అనంతరం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు పిప్రి గ్రామానికి చెందిన గుస్సాడీలతోపాటు దండారీ బృందం సభ్యులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఆదివాసీ గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించాలని ఎంపీపీ పోటే శోభాబాయి అన్నారు. మండలంలోని అనంతపూర్, రాంలింగంపే ట్, మల్కుగూడ గ్రామాల్లో శనివారం నిర్వహించిన దం డారీ ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. గుస్సాడీలు, యువకులు, మహిళలు చేసిన నృత్యాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదివాసీ గిరిజనులు జరుపుకునే గుస్సాడీ దండారీ ఉత్సవాలు ప్రపంచానికి తెలిసేలా నిర్వహించాలన్నారు. ఆదివాసీ సంప్రదాయా లు కాపాడుకొని నేటి యువతకు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపటేల్ పుర్కా సుంగు, శేఖు, నాగోరావ్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు పోటే సాయినాథ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
దీపావళి పండుగను పురస్కరించుకొని ఆదివాసీ గిరిజనులు నిర్వహించే దండారీ ఉత్సవాలు బాగున్నాయని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. మండలంలోని గిన్నేరాలో నిర్వహించిన దండారీ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దండారీలకు మంజూరు చేసిన రూ.10 వేల చెక్కును అందించారు. ముందు గా ఆయనకు గుస్సాడీలు ఘన స్వాగతం పలికారు. ఏత్మాసూర్ పేన్ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుస్సాడీలతో పాటు దండారీ బృందం సభ్యులతో కలిసి నృత్యం చేశారు. ప్రతి యేటా భక్తి శ్రద్ధ లతో దం డారీ ఉత్సవాలు నిర్వహి స్తున్నారని చెప్పారు. ఈ కార్య క్రమంలో ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, డీటీడీవో దిలీప్‌కుమార్, జీవ వైవిధ్య కమిటీ సభ్యులు మర్సుకోల తిరుపతి, అనిల్ రాథోడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.