బోథ్, ఫిబ్రవరి 9: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు తీసి, దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. బోథ్‌లో టీఆర్ఎస్ మండల కన్వీనర్ రుక్మాణ్‌సింగ్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సంధ్యారాణి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అల్లకొండ ప్రశాంత్, నాయకులు రాజు, నారాయణరెడ్డి, చట్ల ఉమేశ్, సత్యనారాయణ, ప్రవీణ్, సదానందం, రాందాస్, నారాయణ, రమేశ్, ఆడెపు శ్రీనివాస్, వహీద్, రఫీ, రిజ్వాన్ పాల్గొన్నారు.
భీంపూర్, ఫిబ్రవరి 9: మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్యయాదవ్ ఆధ్వర్యంలో నాయకులు ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు అనిల్, సర్పంచ్‌లు గొంటిముక్కుల భూమన్న, కృష్ణ్ణయాదవ్, మడావి లింబాజీ, బక్కి అజయ్‌యాదవ్, నాయకులు నరేందర్‌యాదవ్, రాథోడ్ ఉత్తమ్, జాదవ్ రవీందర్, సంతోష్, మర్ల వినోద్‌యాదవ్, నితిన్, కార్యకర్తలు పాల్గొన్నారు.
తలమడుగు, ఫిబ్రవరి 9 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మతో శవయాత్రను నిర్వహించి దహనం చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ జీవన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మగ్గిడి ప్రకాశ్, సునీత రెడ్డి, పల్లవి, నారాయణ, లక్ష్మణ్, మల్కు, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, ఫిబ్రవరి 9 : పార్లమెంట్లో ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా ఎదుట టీఆర్ఎస్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి రోడ్డుపై బైఠాయించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకొని నాయకులతో వాగ్వాదానికి దిగారు. వారం రోజుల క్రితం కేసీఆర్ దిష్టిబొమ్మను కొన్ని పార్టీల నాయకులు దహనం చేస్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీఎంపీపీ సుభాష్ పాటిల్, ఆత్మచైర్మన్ నరాల రవీందర్, మాజీ కన్వీనర్ మేరాజ్ అహ్మద్, దాసరి భాస్కర్, ముస్తాఫా, పురుషోత్తం రెడ్డి, ఆర్గుల గణేశ్, రాథోడ్ ప్రకాశ్, వెంకటేశ్, గంగయ్య, గైక్వాడ్ గణేశ్, ఉప్పారపు శంకర్, భీముడు, రామేశ్వర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుడిహత్నూర్, ఫిబ్రవరి 9 : మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బూర్ల లక్ష్మీనారాయణ, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు తిరుమల్‌గౌడ్, ఎంపీటీసీ శగీర్ఖాన్, కోఆప్షన్ సభ్యుడు జమీర్, జిల్లా, మండల నాయకులు జాదవ్ రమేశ్, లింగంపెల్లి రాజేశ్వర్, మాధవ్, పాటిల్ రాందాస్, జంగు, జలంధర్ పాల్గొన్నారు.
సిరికొండ,ఫిబ్రవరి 9: తెలంగాణ రాష్ర్టానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ మండల కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద టీఆర్ఎస్ మండల కన్వీనర్ బాలాజీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అశోక్, గ్రామాధ్యక్షుడు మల్లేశ్, నాయకులు శంకర్, బషీర్, రవి, గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, ఫిబ్రవరి 9: మండల కేంద్రంలోని ఇచ్చోడ-సోనాల ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజారాం ఆధ్వర్యంలో నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు పోతన్న, జగదీశ్వర్, ప్రభు, నరేశ్, అక్షయ్, శేఖర్, ఉత్తమ్, సాయన్న, ప్రకాశ్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
బోథ్, ఫిబ్రవరి 9: బోథ్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, కే మహేందర్, మహ్మద్, నాసర్ అహ్మద్, సల్ల రవి, బొడ్డు గంగారెడ్డి, శేఖర్, గంగాధర్ పాల్గొన్నారు.
ఎదులాపురం, ఫిబ్రవరి 9 : రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు సరికాదని ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత అన్నారు. తెలంగాణ రాష్ట్రం, కాంగ్రెస్ పార్టీపై ప్రధాన మోదీ వ్యాఖ్యలు నిరసిస్తూ జిల్లా కేంద్రంలో నాయకులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ప్రధా ని మోదీ ఫ్లెక్సీని దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు గంగాధర్, నగేశ్, నర్సింగ్, రూపేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
జైనథ్, ఫిబ్రవరి 9 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో బైక్ ర్యాలీతో ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్థన్, నాయకులు తుమ్మల వెంకట్‌రెడ్డి, ఎస్ లింగారెడ్డి, సీనియర్ నాయకులు రొకండ్ల రమేశ్, నిమ్మల రమేశ్‌రెడ్డి, ప్రభాకర్, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తం యాదవ్, ప్రశాంత్ రెడ్డి, పోతన్న పాల్గొన్నారు.