Group 2 Results | గ్రూప్ 2 ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ వాసులు సత్తా చాటారు. ఒకరు స్టేట్ 15, మరొకరు 51వ ర్యాంకు సాధించారు. బజార్ హత్నూర్ మండలంలోని కొల్హారి గ్రామానికి చెందిన బుద్దేవార్ నర్సింలు – రాధ దంపతుల కుమారుడు బుద్దేవార్ ముఖేష్ 418 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. బజార్ హత్నూర్ గ్రామానికి చెందిన బిట్లింగ్ లక్ష్మణ్ – నీల దంపతుల కుమారుడు బిట్లింగ్ ఉదయ్ 404 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 51 వ ర్యాంక్ సాదింధి తమ ప్రతిభ కనబర్చారు.
ముఖేష్ చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండేవాడు. పదో తరగతి వరకు సోనాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఇంటర్ ట్రిపుల్ ఐటీ బాసరలో, హైదరబాద్‌లోని ఖైరతాబాద్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తి అయిన తర్వాత పంచాయితీ కార్యదర్శి, గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడింది. ఆ పరీక్షలకు హాజరై.. మూడు ఉద్యోగాలు సాధించాడు. 2019లో పంచాయితీ కార్యదర్శిగా ఎంపికయ్యాడు. 2021లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని పొందాడు. ప్రస్తుతం ఆసిఫాబాద్ ఇరిగేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
బిట్లింగ్ ఉదయ్ ఇప్పటికే పంచాయతీ కార్యదర్శి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, వీఆర్వో, గ్రూప్ 4 సింగరేణి (ఎస్సీసీఎల్) ఉద్యోగాలు పొందాడు. తాజాగా గ్రూప్ 2 ఉద్యోగానికి ఎంపికయ్యాడు.