ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 20: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడానికి కృషి చేసిన మహనీయులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో శనివారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వజ్రోత్సవాల సందర్భంగా మహిళలకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సామాజిక అంశాలను తెలియపర్చేలా ముగ్గులు వేయడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం విజేతలైన రేణుక (ప్రథమ), సంగీత (ద్వితీయ), జాదవ్ అశ్విని తృతీయ స్థానాల్లో నిలువగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, మున్సిపల్ కమిషనర్ శైలజ, తదితరులు పాల్గొన్నారు.
బోథ్, ఆగస్టు 20 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ సూచించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా బోథ్, పిప్పల్‌ధరి, కౌఠ(బీ), సొనాల, కరత్వాడ, పొచ్చెర గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు జాతీయ జెండాలతో కూడిన ముగ్గులు వేసి దేశ భక్తిని చాటారని అన్నారు.
పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ సంధ్యారాణి, ఎంపీడీవో దుర్గం రాజేశ్వర్, ఎంపీవో జీవన్‌రెడ్డి, ఈజీఎస్ ఏపీవో జగ్దేరావు, ఏపీఎం మాధవ్, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్‌లు సదానందం, రాధిక, సింధు, సీసీ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్, ఆగస్టు 20 : మండలంలోని జామాడ గ్రామంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత బాలికల పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు ఆకర్షణీయమైన ముగ్గులు వేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నెహ్రూ, పీడీ విశ్వనాథ్, ఉపాధ్యాయులు రాథోడ్ హరిచంద్, శివాజీ, కైలాస్, మల్కు, రాజు, రాజ్యలక్ష్మి, పుష్పలత, రవి, సునీత పాల్గొన్నారు.
భీంపూర్, ఆగస్టు 20 : భీంపూర్ ఐకేపీ భవనంలో, పిప్పల్‌కోటి గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ఎస్ఐ రాధిక, జడ్పీటీసీ సుధాకర్, ఎంపీపీ రత్నప్రభ పరిశీలించారు. గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు.
ఇచ్చోడ, ఆగస్టు 20 : మండల కేంద్రంలోని జడ్పీ సెకండరీ పాఠశాల ఆవరణలో మండల సమాఖ్య (ఐకేపీ) ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు నిమ్మల శివ కుమార్ రెడ్డి, జాహేద్, ఎస్ఐ దేవ్‌రావ్, ఏపీఎం దయాకర్, సీసీలు, సీఏలు, వీవోలు పాల్గొన్నారు.
నేరడిగొండ, ఆగస్టు 20 : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో భవిత మండల సమాఖ్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు వేసిన ముగ్గులను జడ్పీటీసీ జాదవ్ అనిల్ తిలకించారు. అనంతరం విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, ఉపసర్పంచ్ దేవేందర్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం సుదర్శన్, సీసీ లు విద్యాసాగర్, లింగరాజు, మండల సమాఖ్య అధ్యక్షురాలు వనజ, ఎంఎస్ సీసీలు నహేద, విజయ, వీవోఏలు పాల్గొన్నారు.
సిరికొండ, ఆగస్టు 20 : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఐకేపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పుష్పలత(ప్రథమ), శైలజ(ద్వితీయ), ప్రగ్యా తృతీయ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్మాద, ఎంపీడీవో సురేశ్, ఐకేపీ ఏపీఎం సంతోష్, ఉప సర్పంచ్ చిన్నరాజన్న, మాజీ సర్పంచ్ పెంటన్న, పంచాయతీ కార్యదర్శి పురుషోత్తం, సహాయక సంఘాల సభ్యులు దత్తు పాల్గొన్నారు.
బేల, ఆగస్టు 20 : మండల కేంద్రంతో పాటు మండలంలోని డోప్టాల, చప్రాల, సిర్సన్న, సాంగిడి గ్రామాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. బేల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పద్మావతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు , యువతులు సందేశాత్మక ముగ్గుల వేశారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, ఎస్ఐ కృష్ణ కుమార్, ఎంపీడీవో భగత్ రవీందర్, ఎంపీవో సమీర్ హైమద్, ఏపీఎం రాజారెడ్డి, గ్రామాల సర్పంచ్‌లు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సీసీలు శరత్ రెడ్డి, లక్ష్మి, ప్రమోద్, నాయకులు తన్వీర్‌ఖాన్, తేజ్రావ్, సునీల్, దేవీదాస్ పాల్గొన్నారు.
నార్నూర్, ఆగస్టు 20 : మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో (ఐకేపీ) మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఆకర్షణీయమైన ముగ్గులు వేసిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ గజానంద్‌నాయక్, ఐకేపీ ఏపీఎం రమేశ్, పీఏసీసీ చైర్మన్ సురేశ్, ఉపసర్పంచ్ సీహెచ్ మహేందర్, ఐకేపీ సీసీలు సంతోష్, కిషన్, మహిళా సంఘాల సభ్యులు, వీవోఏలు పాల్గొన్నారు.
జైనథ్, ఆగస్టు 20: మండల కేంద్రంలో యువతులకు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఎంపీపీ గోవర్ధన్ విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, వైస్‌ఎంపీపీ విజయ్‌కుమార్, డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, ఎస్ఐ పెర్సిస్ బిట్ల, డీటీ రాజేశ్వరి, సర్పంచ్ దేవన్న, ఎంపీటీసీ సుదర్శన్, కేజీబీవీ ప్రిన్సిపాల్ వీణాకుమారి, ఏపీఎం చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయుడు లస్మన్న, విద్యార్థులు పాల్గొన్నారు.
తాంసి, ఆగస్టు 20 : మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. తాంసి కేజీబీవీలో నిర్వహించిన వేడుకల్లో జడ్పీటీసీ తాటిపెల్లి రాజు హాజరై విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రవీందర్, ఏపీఎం రవీందర్, సర్పంచ్ కృష్ణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అరుణ్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, ఆగస్టు 20 : గ్రామీణ ప్రాంతంలోని యువతులు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యర్డులో ఐకేపీ ఆధ్వర్యంలోముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శోభాబాయి, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, ఎంపీడీవో పుష్పలత, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఎంపీటీసీలు స్వర్ణలత, ఆశాబాయి, ఏపీఎం రాథోడ్ రామారావ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.