నిర్మల్ అర్బన్, ఆగస్టు 15 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతోనే నిర్మల్ జిల్లా అభివృద్ధి పథంలో ముందు ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు.
మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయులు అలుపెరుగని పోరాటం చేస్తేనే స్వాతంత్య్రం సిద్ధించిందని అన్నారు. వారి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, కొండాపూర్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో మంత్రి జెండా ఎగురవేశారు.
కార్యక్రమంలో జడ్పీచైర్‌పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ప్రముఖ వ్యాపార వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, నాయకులు మారుగొండ రాము, రాజేందర్, ముడుసు సత్యనారాయణ, పాకాల రాంచందర్, కోటగిరి అశోక్, ఎస్పీ రాజు, నర్సాగౌడ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.