‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కుమ్రం భీం ఆసిఫాబాద్ వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ముందుకె ళ్తున్నామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లా ప్రజల ఆరోగ్యంపై ప్రతి రోజూ సమీక్షిస్తున్నామని, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచామని తెలిపారు. హైరిస్క్ గ్రామాల్లో నిత్యం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, సాధారణ జ్వరాలకు అక్కడికక్కడే చికిత్స చేస్తున్నామని, తీవ్రతను బట్టి జిల్లా కేంద్రంలోని దవాఖానకు తరలిస్తున్నామని వివరించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : సీజనల్ వ్యాధుల నివారణకు ప్ర త్యేక ప్రణాళికలు రూపొందించి ముందుకెళ్తున్నామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి పే ర్కొన్నారు. గురువారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంట ర్వ్యూ ఇచ్చిన ఆయన, పలు అంశాలపై మాట్లాడారు.
డీఎంహెచ్‌వో : జిల్లాలో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణకు అన్ని రకాల చర్యలు తీ సుకుంటున్నాం. జిల్లాలోని 22 ప్రాథమి ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాం. దవాఖానల్లో పనిచేసే సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. పీహెచ్‌సీల పరిధిలోని ప్రజల ఆరోగ్యంపై ప్రతి రోజూ సమీక్షిస్తున్నాం.
డీఎంహెచ్‌వో : జిల్లాలో ఈ ఐదేళ్లలో ఏయే గ్రామా ల్లో ఎక్కువగా సీజనల్ వ్యాధులు వస్తున్నాయనే విషయాలపై సమీక్షించాం. జిల్లాలో 88 హైరిస్క్ గ్రామాలను గుర్తించాం. ప్రతి గ్రామం పరిధిలో దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నాం. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ఆయా గ్రామాల పరిధిలో రెగ్యులర్‌గా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం. సాధారణ జ్వరాలకు అక్కడికక్కడే చికిత్స చేస్తున్నాం. వ్యాధుల తీవ్రతను బట్టి వారిని జిల్లాకేంద్రంలోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నాం. ర్యాఫిడ్ ఫీవర్ సర్వే చేస్తున్నాం. లక్షా 25 వేల క్లోరిన్ ట్యాబ్లెట్లు వచ్చాయి. నీ టిని శుద్ధిచేసేందుకు వీటిని వినియోగిస్తున్నాం.
డీఎంహెచ్‌వో: ఈ వర్షాకాల సీజన్లో ఇప్పటి వరకు 44 మలేరియా పాజిటివ్, 6 డెంగ్యూ కేసు లు వచ్చా యి. మలేరియా, డెంగ్యూ నివారణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని శాఖల సమన్వయంతో గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి పెట్టాం. గ్రామాల్లో ప్రజలు కూడా పరిశుభ్రత పాటించాలి. మలేరియా, డెంగ్యూ వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి.
డీఎంహెచ్‌వో : వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 8 వేల దోమ తెరలను తెప్పించాం. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం.
డీఎంహెచ్‌వో : ఇది పాముల కాలం. జిల్లాలో ఈ మధ్యకాలంలో రెండు పాముకాటు మరణాలు జరిగాయి. పాముకాటుకు గురైన వారిని సకాలం లో దవాఖానకు తీసుకువచ్చి ఉంటే బాగుండేది. జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పా ముకాటు మందులు అందుబాటులో ఉన్నాయి. 22 పీహెచ్‌సీల పరిధిలో 10 నుంచి 45 డోసులు వరకు అందుబాటులో ఉంచాము. ఎవరైనా పా ముకాటుకు గురైతే వెంటనే 108కు సమాచారం ఇవ్వాలి. ఆ గ్రామం పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువస్తే ప్రాణాలు కాపాడవచ్చు.