ఉట్నూర్,ఆగస్టు 4 : సరదాగా ఈతకు వెళ్లిన యువకులు వాగులో గల్లంతయ్యారు. దీంతో పట్టణంలోని మోమిన్‌పుర, నిర్మల్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. మండల కేంద్రానికి చెందిన ఉస్మాన్, రిషాన్, అద్నాన్, ఆయాన్(18)తో పాటు నిర్మల్‌కు చెందిన అస్లాం(23) మండలంలోని గంగాపూర్ వద్ద ఉన్న వంకతుమ్మ వాగులో ఈతకు వెళ్లారు.
అయితే ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఒక్కసారిగా వాగులో నీరు ఉధృతి పెరుగడంతో మధ్యలో ఉన్న ఆయాన్, ఇస్లాం కొట్టుకపోయారు. ఒడ్డుకు సమీపంలో ఉన్న యువకులు వారికి కాపాడేందుకు విఫలయత్నం చేశారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఉట్నూర్ సీఐ సైదారావు, ఎస్ఐ భరత్ సుమన్, ఫైర్ సిబ్బంది, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు వాగు వద్దకు చేరుకొని గల్లంతైన వారి కోసం గాలించిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిర్మల్‌కు చెందిన అస్లాం మూడు రోజుల క్రితం ఉట్నూర్‌లోని బంధువు ఇంటికి వచ్చి వాగులో గల్లంతు కావడంతో రెండు కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.