ఆదిలాబాద్ రూరల్, జూలై 30: ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి నిర్వహించడానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్ఎస్సీ పరీక్షలకు 681మంది, ఇంటర్లో 5,628మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇంటర్ విద్యార్థుల కోసం 11 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఐఈవో రవీంద్ర కుమార్ తెలిపారు.
ఆదిలాబాద్, ఉట్నూర్, బోథ్లలో ఎస్ఎస్సీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఈవో టామ్నె ప్రణీత వెల్లండిచారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45వరకు పరీక్ష ఉంటుందని వెల్లడించారు. ఉదయం 9నుంచి 12గంటల వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం5.30గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు.