కాగజ్‌నగర్ రూరల్, జూన్ 21: జనాభాకు సరిపడా ఉద్యానవన పంటలు సాగు కావడం లేదని, జిల్లాలోని రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పండించేలా అవగాహన కల్పించాలని రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అజ్మీరా ప్రే మ్ సింగ్ సూచించారు. మండలంలోని జం బుగ, రాస్పెల్లి గ్రామాల్లో ఆయిల్ పామ్ తోటలను పరిశీలించి రైతులుకు పలు సూచనలు చే శారు.
అనంతరం కాగజ్‌నగర్‌లోని ఆర్అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఉద్యానవన పంటలు కూరగాయా లు, పండ్లు, పూలు, సుగంధద్రవ్యాలు సా గు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూ చించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అ బ్దు ల్ నదీం, ఉద్యానవన శాఖ అధికారులు శాంతిప్రియదర్శిని, జ్యోతి, ఆయిల్‌పామ్ మ్యాట్రిక్స్ కంపెనీ ప్రతినిధులు శివకృష్ణ, జైన్ కంపెనీ ప్రతినిధులు శ్రీనివాస్, రైతులు పాల్గొన్నారు.