ఆదిలాబాద్ రూరల్, జూన్ 21 : యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ శాఖ, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో రెవెన్యూ గార్డెన్లో మంగళవారం ఏర్పాటు చేసిన సామూహిక యోగా కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిత్యం అరగంటైనా వ్యాయామం చేయాలన్నారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ.. యోగా చేయడం వల్ల సమస్యలన్నింటినీ దూరం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, డీవైఎస్వో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, జూన్ 21 : స్థానిక కేబీ కాంప్లెక్స్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన యో గా దినోత్సవంలో ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డితో కలిసి జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. యోగాతో మానసిక ప్రశాంతత, శరీరానికి ఉత్తేజం కల్గుతుందన్నారు. అనంతరం పీవో మాట్లాడుతూ పని ఒత్తిడితో ఉద్యోగులు అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుత్నురన్నారు. అందుకు ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటి వద్దే యోగా చేయడం వల్ల ఉత్సాహం కలుగుతుందన్నారు. త్వరలో ఐటీడీఏ ఉద్యోగులకు యోగా శిక్షణ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు కూడా యోగా శిక్షణ ఇస్తామన్నారు. అనంతరం యోగాచార్యులు చేతన్, యోగా, ప్రాణాయమం, ధ్యానం యొక్క విశిష్ఠతను వివరించి, ఆసనాలు చేయించారు. భార్గవ్, వైష్ణవి యోగా విన్యాసాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో డీడీ దిలీప్, ఈఈ భీంరావు, ఏపీవో పీటీజీ భాస్కర్, రమణ, జగన్, రాంబాబు, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, పార్థసారథి, ఆర్సీవో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.