ఎదులాపురం, జూన్ 21 : నిత్యం యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని న్యాయమూర్తి మాధవికృష్ణ అన్నారు. ఆదిలాబాద్‌లోని డీఎల్ఎస్ఏ సమావేశ మందిరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. యోగా గురువు తెలిపిన విధంగా న్యాయమూర్తులు యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎం సతీశ్‌కుమార్, క్షేమదేశ్పాండే, ఉదయ్‌భాస్కర్‌రావు, ఎస్ మంజుల, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రల నగేశ్, న్యాయవాదులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాంసి, జూన్ 21 : మండలంలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పల్లె ప్రకృతివనాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఆకుల భూమయ్య, ఎంపీవో సుధీర్‌రెడ్డి, ఏపీఎం రవీందర్, సర్పంచ్‌లు కృష్ణ, సదానందం, వెంకన్న, కేశవ్‌రెడ్డి, శ్రీనివాస్, భరత్, నర్సింగ్, గజానన్, ఎంపీటీసీలు అశోక్, నరేశ్, భాగ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
బేల, జూన్ 21 : మండల కేంద్రంలోని ప్రైవేట్ గార్డెన్లో యోగా గురువు రాజ్‌కుమార్ విద్యార్థులతో పలు రకాల ఆసనాలు వేయించారు. మండలంలోని చప్రాల, మణియార్‌పూర్, సాంగిడి గ్రామాల్లోని పాఠశాలల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు వాడ్కర్ తేజ్రావ్, దౌలత్ పటేల్, సుమన్‌బాయి, నాయకులు పాల్గొన్నారు.
జైనథ్, జూన్ 21 : మండలంలోని బెల్గాం, లక్ష్మీపూర్, సిర్సన్న గ్రామాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గంగన్న, ఊశన్న, లక్ష్మీరాములు, ఉపసర్పంచ్ స్వామి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, జూన్ 21 : మావల మండలం బట్టిసావర్గంలోని పల్లె ప్రకృతి వనంలో డీఆర్డీవో కిషన్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలోరాథోడ్ రవీందర్, కృష్ణారావ్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం స్విమ్మింగ్ ఫూల్లో యోగా గురువు సంతోష్ క్రీడాకారులతో యోగాసనాలు వేయించారు. కార్యక్రమంలో కోచ్ కృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు రాకేశ్, చంద్రకాంత్ పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు యోగాపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రంజనా ఝా, ఉపాధ్యాయులు అశోక్, రాజు, గజేందర్ పాల్గొన్నారు.
ఎదులాపురం, జూన్ 21 : ఆదిలాబాద్ ఏఆర్హెడ్క్వార్టర్స్లో యాపల్‌గూడ రెండో బెటాలియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కమాండెంట్ ఆర్ వేణుగోపాల్, బెటాలియన్ ఆఫీసర్లు, సిబ్బంది యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ జయరాజు, తదితరులు పాల్గొన్నారు.
ఎదులాపురం, జూన్ 21 : జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్ అంగన్వాడీ కేంద్రం -1లో కార్యకర్త రాధ పిల్లలతో యోగాసనాలు వేయించారు. అలాగే గర్భిణులు, బాలింతలు యోగాసనాలు వేశారు.
బోథ్, జూన్ 21: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని బోథ్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి బీ హుస్సేన్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రగతి పాఠశాలలో యోగా గురువు పోశెట్టితో కలిసి యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్‌యాదవ్, న్యాయవాదులు హరీశ్, విజయ్‌కుమార్, వీడీసీ చైర్మన్ గంగాధర్ పాల్గొన్నారు. అలాగే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులు యోగా విన్యాసాలు ప్రదర్శించారు. ప్రిన్సిపాల్ స్వర్ణలత, వైస్ ప్రిన్సిపాల్ భాగ్యశ్రీ, జ్యోతి, లావణ్య, రాధ, కిరణ్, సంతోష్, ప్రసాద్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 21 : మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంలో జీవ వైవిధ్య కోఆర్డినేటర్ సోన్కాంబ్లే గోపీనాథ్, సర్పంచ్ కోరెంగా గాంధారి, ఎంపీవో సంతోష్, మండల అధికారులు ప్రజాప్రతినిధులు యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ జాదవ్ స్వర్ణలత, జడ్పీ పాఠశాల చైర్మన్ కాంబ్లే బాపురావ్, సిబ్బంది, బంజారా యువసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సంజీవ్, నాయకులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, జూన్ 21 : సమాజంలో ప్రతి ఒక్కరూ యోగాను అలవర్చుకోవాలని ఎంఈవో రాథోడ్ ఉదయ్‌రావ్ అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ ఆవరణలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. విద్యార్థుల యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు క్రీడా పరికరాలు అందజేశారు. కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం కో ఆర్డినేటర్ గౌతమి, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు రమణా రెడ్డి, పీఈటీ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, జూన్ 21 : మండలంలోని పలు గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాల్లో అధికారులు, యువత యోగా చేశారు. కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి వామనభట్ల రాంప్రసాద్, ఎంపీవో కొమ్ము రమేశ్, ఏపీవో నరేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
భీంపూర్, జూన్ 21: భీంపూర్ పల్లె ప్రకృతి వనంలో సర్పంచ్ మడావి లింబాజీ, రైతులు యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జాదవ్ రవీందర్, నాయకులు రాథోడ్ ఉత్తమ్, పాండురంగ్, పురుషోత్తం, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్, జూన్ 21 : యోగాతోనే మానసికోల్లాసం కలుగుతుందని సర్పంచ్‌లు కొడప మోతుబాయి, జాదవ్ సునీత అన్నారు. నార్నూర్, గాదిగూడ మండలాల్లోని సావ్రి, నాగల్కొండ గ్రామ పంచాయతీల పరిధిలోని పల్లె ప్రకృతి వనాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సునీల్, మాజీ సర్పంచ్ జాకు, వార్డు సభ్యులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సిరికొండ, జూన్ 21 : రాయిగూడ ఆశ్రమోన్నత, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో పీడీ గణేశ్ ఆధ్వర్యంలో విద్యార్థులు యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శశికాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నేరడిగొండ, జూన్ 21 : శరీర పరిపూర్ణత యోగాతోనే సాధ్యమవుతుందని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడీవో అబ్దుల్సమద్, సర్పంచ్ పెంట వెంకటరమణ, ఎంపీవో శోభన, గ్రామస్తులతో కలిసి యోగాసనాలు వేశారు. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యోగా ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.