ఆదిలాబాద్ రూరల్, జూన్ 21: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఫ్రొఫెసర్ జయశంకర్ సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్‌లోని తెలంగాణచౌక్‌లో మంగళవారం జయశంకర్ సార్ వర్ధంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు శివకుమార్, రాము, సంతోష్, దేవన్న పాల్గొన్నారు.
భీంపూర్, జూన్ 21 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య యాదవ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అనిల్, సర్పంచ్‌లు మడావి లింబాజీ, పెండెపు కృష్ణయాదవ్, కరీం, భూమన్న, ఉపసర్పంచ్ జాదవ్ రవీందర్, నాయకులు రాథోడ్ ఉత్తమ్, పాండురంగ్, పురుషోత్తం, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 21 : మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయ ఆవరణలో పీవో వరుణ్‌రెడ్డి, ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ లక్కేరావ్, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంలో ప్రొఫెసర్ కీలక పాత్ర పోషించరన్నారు. ఆయన ఆశయాలతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో పీటీజీ భాస్కర్, ఏపీవో జనరల్ భీంరావ్, డీడీ దిలీప్, జీవ వైవిధ్య నిర్వహణ కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి, ఆత్రం గంగాధర్, ఉద్యోగులు జగన్, రమణ, రాంబాబు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ పాత్ర మరువలేనిదని ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఏఆర్ఎస్ కళాశాలలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో తిరుమల, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు రషీద్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, సర్పంచ్‌లు మల్లిక, కళావతి, సునీల్, ఏపీవో రజినీకాంత్, సీనియర్ నాయకుడు దాసండ్ల ప్రభాకర్, మనోహర్, ప్రజ్ఞశీల్, ఆశన్న, రవి, జుబేర్, సతీశ్, రాజ్‌కుమార్, భూమన్న, బలవంత్, స్వామి పాల్గొన్నారు.
బోథ్, జూన్ 21: మండల కేంద్రంలో జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్‌సింగ్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, సర్పంచ్ సురేందర్‌యాదవ్, ఆత్మ చైర్మన్ సుభాష్, అల్లకొండ ప్రశాంత్, ఎలుక రాజు, సత్యనారాయణ, బుచ్చన్న, ప్రవీణ్, లక్ష్మణ్, అమృత్, నారాయణ, దేవీదాస్ పాల్గొన్నారు.
తాంసి, జూన్ 21 : ఆదిలాబాద్‌లోని ఏఆర్ఎస్లో ప్రధానశాస్త్రవేత్త, అధిపతి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, సిబ్బంది మహేశ్, ప్రమోద్, నరేశ్, గంగారాం, నాన్టీచింగ్స్టాఫ్, ఔట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
తాంసి, జూన్ 21 : మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి నిర్వహించారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ తారుడి అరుణ్‌కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, సర్పంచ్ కృష్ణ, మాజీ ఎంపీటీసీ గంగారాం, నాయకులు శ్రీనివాస్, పరమేశ్, మహేందర్, కల్యాణ్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్, జూన్ 21 : మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్, మాజీ ఎంపీపీ కుమ్మరి సత్యరాజ్, నాయకులు మాధవ్, జలంధర్, ఫడ్ దిలీప్, కొల్లూరి వినోద్, లక్ష్మణ్, రాయిసిడాం జంగు, ఓర్సు మారుతి, దోమకొండ సుధాకర్, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.