ఎదులాపురం,జూన్ 21: మట్కాకు అలవాటు పడి చివరకు దొంగగా మారాడు. ఏకంగా 25 ద్విచక్రవాహనాలను చోరీ చేసిన దొంగను నెల రోజుల్లోనే ఆదిలాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను ఎస్పీడీ ఉదయ్‌కుమార్ వెల్లడించారు. ఆదిలాబాద్‌లోని సుందరయ్యనగర్‌కు చెందిన షఫీఖాన్(33) మట్కాకు అలవాటుపడ్డాడు. డబ్బులు త్వరగా సంపాదించేందుకు చోరీల బాట పట్టాడు. ఆదిలాబాద్ లో రెండు నెలలుగా రిమ్స్, ఆర్టీసీ బస్టాండ్, ఆంధ్రా బ్యాంక్ తదితర రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన 25 ద్విచక్రవాహనాలను చోరీ చేశాడు.
ఆ వాటిని సీసీఐ రోడ్డు సమీపంలో ప్కారింగ్ చేశాడు. అక్కడి నుంచి ఒక్కొక్కటిగా మహారాష్ట్రలోని పాండ్రకౌడలో రూ.10 వేల నుంచి రూ. 20వేల వరకు విక్రయించాడు. వచ్చిన డబ్బులతో మట్కా ఆడేవాడు. బైక్‌లు చోరీ అవుతున్న క్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశారు. చోరీ చేసిన వాహనాలను అమ్ముతుండగా షఫీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న 18 వాహనాలను కోర్టు అనుమతితో తిరిగి బాధితులకు అందజేస్తామని తెలిపారు. ఈ టీమ్‌లో పనిచేసిన ఎస్ఐ విఠల్‌కు కానిస్టేబుల్ బీ సాజన్లాల్, బీ నరేశ్, ఆర్ రమేశ్ రివార్డులు అందించిన అభినందించారు. డీఎస్పీ వీ ఉమేందర్, టూటౌన్ సీఐ కే శ్రీధర్ ఉన్నారు.
ఆన్లైన్ మట్కా నిర్వాహకుడిని అరెస్టు చేసి రూ.25 వేలు,సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ సీఐ ఈ చంద్రమౌళి తెలిపారు. సోమ వారం అర్ధరాత్రి శాంతినగర్ పరిధిలో మట్కా నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టారు. సుందరయ్యనగర్‌కు చెందిన సయ్యద్ జావీద్ ఆన్లైన్లో మట్కా నిర్వహిస్తుం డగా పోలీసులు పట్టుకున్నారు. దాడిలో ఎస్ఐ రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లో వచ్చే ఏడాదిలోగా వెయ్యి సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ ప్రక్రియ వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభమవుతుందన్నారు.