శ్రీరాంపూర్, జూన్ 20 : శ్రీరాంపూర్ ఓసీపీ, ఆర్కే-5బీ గనిపై సోమవారం కార్మికులు, అధికారులు స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరాంపూర్ ఓసీపీపై ప్రాజెక్టు ఆఫీసర్, కార్మికులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కార్మికులతో కలిసి ఓసీపీ ఆవరణలోని చెత్తాచెదారం తొలగించారు. ఈ సందర్భంగా పీవో పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ.. స్వచ్ఛతతోనే అందరికీ ఆరోగ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఓసీపీ మేనేజర్ జనార్దన్, సేఫ్టీ ఆఫీసర్ వీరయ్య, ఈఈ చంద్రశేఖర్, పర్యావరణ అధికారి జలాలుద్దీన్, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి పెంట శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు.
ఆర్కే-5బీ గనిపై మేనేజర్ అబ్దుల్ ఖాధీర్ ఆధ్వర్యంలో కార్మికులు, నాయకులు శ్రమదానం చేశారు. ఆర్కే-7 సపోర్ట్మన్ సదానందం, భూపతి స్వచ్ఛతపై పాటలు పాడారు. కళా ప్రదర్శనలతో కార్మికులను చైతన్యపర్చారు. కార్మికులు ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదని కోరారు. గనిపైకి ప్లాస్టిక్ కవర్లు తెచ్చిన వారిపై ఆలయ కమిటీ ద్వారా రూ.10 జరిమానా విధించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ వీరన్న, అసిస్టెంట్ మేనేజర్ రాంచందర్ ఈఈ సందీప్, సీనియర్ పీవో రణధీర్, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి తూమల సత్యనారాయణ, మహేందర్రెడ్డి పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, జూన్ 20 : పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని శ్రీరాంపూర్ సీహెచ్పీ డీజీఎం వెంకటేశ్వర్రావు అన్నారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఆవరణలోని పిచ్చిమొక్కలను ఉద్యోగులతో కలిసి ఆయన తొలగించారు. డీజీఎం మాట్లాడుతూ.. ప్రతి కార్మికుడు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పరిశుభ్రత పాటిస్తే గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి వరకు అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని పేర్కొన్నారు. అనంతరం స్వచ్ఛతా పక్వాడాపై ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ బసవరాజు, ఇంజినీర్ దామోదర్, పిట్ కార్యదర్శి శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.