త్రివిధ దళాల్లో స్వల్పకాలిక ప్రాతిపదికన సైనికులను నియమించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’పై ఆందోళనలు నెలకొంటున్న నేపథ్యంలో మంచిర్యాల, కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఘటన దృష్ట్యా అదనపు బలగాలను మోహరించి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి దాణాపూర్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు.
మంచిర్యాల, నమస్తే తెలంగాణ/ గర్మిళ్ల/కాగజ్‌నగర్‌టౌన్, జూన్ 17 : త్రివిధ దళాల్లో స్వ ల్పకాలిక ప్రాతిపదికన సైనికులను నియమించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొ న్న నేపథ్యంలో జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించా రు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఘట న దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు మంచిర్యాలలోని రైల్వే స్టేషన్లో శుక్రవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా స్థానిక రైల్వే స్టేషన్లో భద్రతను పెం చారు. అదనపు బలగాలను మోహరించారు. వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్న వారిని క్షుణ్ణంగా పరిశీలించారు. మంచిర్యాల రైల్వే స్టేషన్ మీదుగా సికింద్రాబాద్-దాణాపూర్ వెళ్లే దాణాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. అనుమానితులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లో ఎస్పీ సురేశ్‌కుమార్, రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్, పట్టణ ఎస్‌హెచ్‌వో రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. సికింద్రాబాద్ నుంచి దాణాపూర్ వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేసిన ట్లు రైల్వే అధికారులు నోటీసు బోర్డును ఏర్పా టు చేశారు. మిగితా రైళ్లు యథావిధిగా రాకపోకలు కొనసాగినట్లు రైల్వే ఆర్పీఎఫ్ ఎస్ఐ మట్టె సాయి తెలిపారు. ఏఎస్పీ అడ్మిన్ అచ్చేశ్వర్రావు రైల్వే స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రైల్వేస్టేషన్‌కు వచ్చే ప్రయాణికులను తనిఖీ చేశారు. వారి వెంట ఎస్ఐ జగదీశ్, ఆర్పీఎఫ్ ఏఎస్ఐ నాగేశ్వర్, జీఆర్పీ కానిస్టేబుల్ సురేశ్‌గౌడ్ ఉన్నారు.