ఎదులాపురం, జూన్ 17 : అటవీ ప్రాంతంలోని గిరిజనుల ఇండ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ రాజేశ్ మోహన్ డోబ్రియాల్ జిల్లా అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అటవీ ప్రాంతంలోని ఇండ్లకు విద్యుత్ సౌకర్యం, గిరి వికాసం పథకం అమలు తదితర అంశాలపై జిల్లాల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆ దిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడు తూ.. జిల్లాలోని 31 గిరిజన అటవీ ప్రాంత అవాసాలకు సింగిల్ ఫేస్ నుంచి త్రీ ఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే మూడు గిరిజన హాబిటేషన్లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు అటవీ శాఖ అ నుమతుల కోసం ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. గిరి వికాసం పథకం కింద జిల్లాలోని గిరిజన రైతుల బోర్ బావులకు విద్యుత్ సౌ కర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అటవీ శా ఖ అధికారి రాజశేఖర్పెట్ల, జిల్లా విద్యుత్ శాఖ అ ధికారి ఉత్తమ్ జాడే, అధికారులు పాల్గొన్నారు.