బాసర, జూన్ 16 : బాసర ట్రిపుల్ఐటీ డైరెక్టర్‌గా సతీశ్‌కుమార్‌ను నియమిస్తూ టెక్నికల్ ఎ డ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రిపుల్‌ఐటీలో మూడు రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలతో రెండో రోజూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మి ట్టల్, వైస్ చా న్స్‌లర్ రాహుల్‌బొజ్జా , మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మె ల్యే విఠల్‌రెడ్డితో కలిసి సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా మంత్రి సబితా ఆదేశాల మేరకు ఉస్మానియా విశ్వ వి ద్యాల యంలో ఈఈఈ విభాగంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సతీశ్‌కుమార్‌ను డైరెక్టర్‌గా నియమించారు. గురువారం సాయంత్రం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
ట్రిపుల్ఐటీ విద్యార్థులు ఆందోళనలు విరమించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ ద్వారా విద్యార్థులను కోరారు. దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తామని, ప్రభుత్వం అండగా ఉంటుందని కోరారు.