మంచిర్యాలటౌన్, జూన్ 11: మంచిర్యాల పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 10, 11, 28 వార్డుల్లో కమిషనర్ బాలకృష్ణ, ఏఈ నర్సింహాస్వామి, కౌన్సిలర్లు పల్లపు సాయిభార్గవి, లావణ్య, శ్రీదేవి, పలువురు టీఆర్ఎస్ నాయకులతో కలిసి పర్యటించారు. పారిశుధ్య పనులు చేయించారు. నిర్మించాల్సిన రోడ్డు, డ్రైనేజీల వివరాలను రాసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, బీసీ టౌన్ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి రాయలింగు, తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి టౌన్, జూన్ 11 : బెల్లంపల్లి పట్టణంలో 32వ వార్డులో మురుగు కాలువల్లో పూడిక తీయించి, రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. 8వ వార్డులో పారిశుధ్య సమస్యను పరిష్కరించారు. అనంతరం ఆట స్థలాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, మున్సిపల్ గోపు గంగాధర్, 31వ వార్డు కౌన్సిలర్ గెల్లి రాజలింగు, వార్డు ప్రత్యేకాధికారులు, వార్డు కమిటీ నాయకులు, సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు.
చెన్నూర్, జూన్ 11: చెన్నూర్ పట్టణంలో పలు వార్డుల్లో శనివారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అర్చనా గిల్డా, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పారిశుధ్య పనులు చేయించారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించి, వీధి దీపాలను ఏర్పాటు చేయించారు.
కోటపల్లి, జూన్ 11 : కోటపల్లి మండలంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. ఎంపీడీవో కే భా స్కర్, ఎంపీవో అక్తర్ మొహియొద్దీన్ పర్యవేక్షించారు.
బెల్లంపల్లిరూరల్, జూన్ 11: బెల్లంపల్లి మండలంలోని గురిజాల నర్సరీని జడ్పీ సీఈవో నరేందర్ పరిశీలించారు. మొక్కల సంరక్షణ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీఈవో వెంట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, సర్పంచ్ గాజుల రంజిత వెంకటేశ్వర్‌గౌడ్, ఎంపీడీవో డీ రాజేందర్, ఏపీవో జీనత్, ఈసీ అనిల్, చంద్రవెళ్లి సర్పంచ్ తాళ్లపల్లి అశోక్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
తాండూర్, జూన్ 11 : మండలంలో తాండూర్, గోపాల్‌నగర్‌లో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఏపీవో నందకుమార్ పర్యటించారు. డంప్ యార్డ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు పరిశీలించారు. పారిశుధ్య పనులు చేయించారు. పల్లె ప్రగతిలో పారిశుధ్యం, హరితహారం, విద్యుత్ సమస్యలు ప్రధాన అంశాలుగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కా ర్యక్రమాల్లో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కా ర్యకర్తలు, వెలుగు సీఏలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
వేమనపల్లి, జూన్ 11 : నాగారం, జిల్లెడ, బుయ్యారం, వేమనపల్లి, సుంపుటం, గొర్లపల్లి, నీల్వాయి గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా కొనసాగాయి. సర్పంచులు, కార్యదర్శులు గ్రామాల్లో పర్యటించి పారిశుధ్య పనులు చేయి ంచారు. నీల్వాయిలో కొనసాగుతున్న పనులను ఎంపీడీవో లక్ష్మయ్య పరిశీలించి సూచనలు చేశారు. నీల్వాయిలోని సర్వే నంబర్ 271, కల్లెంపల్లి పంచాయతీలోని ముక్కిడిగూడెంలో సర్వే నంబర్ 13లో ఎకరం భూమిని తెలంగాణ క్రీడా మై దానం కోసం కేటాయించినట్లు తహసీల్దార్ రాజ్‌కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సంతోష్‌కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, సర్పంచులు పద్మ, కుబిడె మధుకర్ , తలండి స్వరూపారాణి, గోగర్ల శ్రీనివాస్, కొండల్‌రెడ్డి, కే బాపు, మోర్ల పద్మ, గాలి మధు, పంచాయతీ కార్యదర్శులు సుదర్శన్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.