దహెగాం, జూన్ 11 : మండలం పశువైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. శనివారం గిరివెల్లి, ఖర్జీ, చంద్రపల్లి గ్రామాల్లో శనివారం పశువైద్య శి బిరాలు నిర్వహించినట్లు పశువైద్యాధికారి శ్రావణ్‌కుమార్ తెలిపారు. 399 గొర్రెలు, 1151 మేకలకు నట్టల నివారణ మందు వేశామని చెప్పారు. వైస్ ఎంపీపీ చౌదరి సురేశ్, సర్పంచ్‌లు కారు రాజ న్న ఎల్కరి సంజీవ్, లగ్గాం దామోదర్, నాయకులు కారు అంజన్న తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్, జూన్ 11 : మండలంలోని బూరుగూడ గ్రామంలో శనివారం నిర్వహించిన పశు వైద్యశిబిరానికి ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్ హాజరయ్యారు. పశు వైద్యాధికారి మురళీకృష్ణతో కలిసి 1600 గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. సర్పంచ్ మాధవి, ఎంపీటీసి రమేశ్, నాయకులు గోపాల్, పెంటయ్య, సిబ్బంది గజానంద్, ప్రశాంత్, సాయి పాల్గొన్నారు.
కౌటాల, జూన్ 11: గుండాయిపేట, తుమ్డిహట్టి, కనికి గ్రామాల్లో మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందు వేసినట్లు పశువైద్యాధికారి శ్రీకాంత్ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌లు ఎడ్ల శారద, చరణ్‌దాస్, గుండాయిపేట ఉపసర్పంచ్ లహాంచు పటేల్, సిబ్బంది సందీప్, రాజన్న, స్రవంతి, ప్రకాశ్, శోభన్ తదితరులు ఉన్నారు.
వాంకిడి, జూన్ 11 : మండలకేంద్రంతో పాటు చిన్న వాంకిడి, నార్లాపూర్, ఖిర్డీ గ్రామాలో 702 గొర్రెలు,1800 మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ చేసినట్లు మండల పశు వైద్యాధికారి శివప్రసాద్ తెలిపారు. వర్షాకాలంలో పశువులకు రోగాలు వచ్చే అవకాశం ఉంటుందని, నివారణకు ముందస్తు టీకాలు వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పశువైద్య సహాయకులు , పశు వైద్య సిబ్బంది గణపతి, సునీల్, లాలాజీ, ఇమ్రాన్, నరేశ్, అటెండర్ ఉన్నారు.
రెబ్బెన, జూన్ 11: మండలంలోని తుంగెడ, పోతపల్లి గ్రామాల్లో శనివారం 5039 మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందు వేసినట్లు మండల పశువైద్యాధికారి శ్వేత తెలిపారు. కార్యక్రమంలో తుంగెడ, మదావాయిగూడ సర్పంచ్‌లు డోంగ్రి పెంటయ్య, దోబే పార్వతీ, ఉపసర్పంచ్ జంబుల సాయికృష్ణ, సిబ్బంది రాజేందర్, వేణు, ప్రేం, వెంకటేశ్, విశ్వనాథ్, శ్రీకాంత్ ఉన్నారు.