తిర్యాణి, జూన్ 11: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో సమస్యలు పరిష్కారమవుతున్నాయని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండలంలోని మాణిక్యపూర్, మంగీ, గుండాల గ్రామాల్లో పర్యటించారు. పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. స్థానికుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. గుండాల గ్రామాల్లో కృత్రిమంగా నిర్మిస్తున్న సబ్ సెంటర్‌ను పరిశీలించారు.
ప్రభుత్వ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడి లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంటింటా లబ్ధిదారులు ఉన్నారని, గ్రామాలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. మారుమూల గ్రామాల్లో రైతులు చిరు ధాన్యాల సాగుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. మార్కెట్లో చిరుధాన్యాలకు మంచి డిమాండ్ ఉందని, వీటిని తింటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరైనా అటవీశాఖ అనుమతి లేక పనులు నిలిచిపోయిన వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మర్సుకోల శ్రీదేవి, జడ్పీటీసీ చంద్రశేఖర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
-మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు
దండేపల్లి, జూన్11: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయని, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశంలో మరెక్కడా లేవని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. దండేపల్లి మండల కేంద్రంలో శనివారం పల్లె ప్రగతి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పలు కాలనీల్లో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణాలోని ఏ గ్రామానికి వెళ్లినా ఊరికో ట్రాక్టర్, ట్యాంకర్, నర్సరీ, డంప్ యార్డ్, శ్మశాన వాటిక ఉంటుందని అన్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలతో గ్రామాల్లో డెంగీ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేని శ్రీనివాస్, సర్పంచ్ చంద్రకళ, ఉపసర్పంచ్ గొట్ల భూమన్న, జీపీ కార్యదర్శి శ్రీలత, టీఆర్ఎస్ నాయకులు బండారి మల్లేశ్, గోళ్ల రాజమల్లు, బొమ్మెన మహేశ్, బొలిశెట్టి రమేశ్, బోడ నర్సింగ్, లక్ష్మణ్, పాల్గొన్నారు.
మంచిర్యాలటౌన్, జూన్ 11: మంచిర్యాల పట్టణంలోని ఎల్ఐసీ కాలనీ పోచమ్మ గుడి నుంచి ఎన్టీఆర్ నగర్ వరకు రూ. 20 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే సైడ్ డ్రైన్ పనులకు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఐసీ కాలనీ, ఎన్టీఆర్నగర్ మధ్య కొత్తగా ఇండ్ల నిర్మాణాలు జరిగి ప్రస్తుతం ఆ రెండు ప్రాంతాలు కలిసిపోయాయని, ముందుగా ఇక్కడ అవసరమైన సైడ్ డ్రైన్ నిర్మాణాన్ని చేపట్టినట్లు తెలిపారు. పట్టణంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అన్ని వార్డుల్లో పార్టీలకతీతంగా పనులు సాగుతున్నాయని అన్నారు. పట్టణాన్నంతటినీ యూనిట్‌గా తీసుకుని నిధులను కేటాయించి పనులు చేస్తున్నామని వివరించారు. పట్టణాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్లు కొండ పద్మ, అంకం నరేశ్, ప్రకాశనాయక్, నాయకులు సరోజ, చంద్రశేఖర్, రవీందర్రావు, తదితరులు పాల్గొన్నారు.
జైనూర్, జూన్ 10: ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతిలో గ్రామాల అభివృద్ధికి కావాల్సిన ప్రణాళికలు రూపొందించి అభివృద్ధి పనులు చేపట్టడంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నట్లు ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శనివారం మండలంలోని చింతకర్ర గ్రామాన్ని సందర్శించారు. పల్లెప్రగతిలో భాగంగా తయారు చేసిన ప్రణాళికలు పరిశీలించారు. గ్రామస్తులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.
అంగన్వాడీ తలుపులు విరిగి ఉండడంతో మరమ్మతు చేయాలన్నారు. పాఠశాలకు ప్రహరీ, సీసీ రోడ్డు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. పాఠశాల అవరణానికి ఫినిషింగ్ పనులు చేపట్టాలని, సీసీ రోడ్డు మంజూరుకు కృషిచేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం టీఆర్ఎస్ నాయకుడు భీమనాయక్ ఇటీవల మృతి చెందగా అతని కుటుంబాన్ని పరామర్శించారు. దశాబ్దాలుగా ఎదురు చేస్తున్న వంతెన నిర్మాణం పూర్తవుతున్నందున అక్కడికి వెళ్లి పనులు పరిశీలించారు.
పనులు వేగవంగా చేయాలని ఆదేశించారు. 3 ఫేస్ విద్యుత్ మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. పనులు చేపట్టాలని విద్యుత్ అధికారులతో మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర హజ్‌కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చిర్లె లక్ష్మణ్, మండల కోఆప్షన్ సభ్యుడు ఫెరోజ్‌ఖాన్, సీనియర్ నాయకుడు మెస్రం అంబాజీరావు, సర్పంచ్‌లు శ్యాంరావు, తానాజీ, జైనూర్ ఉపసర్పంచ్ అబ్బు, జైనూర్ ప్రభుత్వ పాఠశాల చైర్మన్ మౌలా, ధరంసింఘ్, నాయకులు పంద్రం శేకు తదితరులున్నారు.