పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో రోజైన శనివారం అధికారులు, ప్రజాప్రతినిధులు వివిధ పనులు చేపట్టారు. క్షేత్రస్థాయి సిబ్బందితో మురుగు కాలువలు, రోడ్లు శుభ్రం చేయించారు. చెత్తాచెదారాన్ని తొలగించారు. కమ్యూనిటీ ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించారు. పవర్‌వీక్‌లో భాగంగా శిథిలావస్థలో ఉన్న స్తంభాలను తొలగించి కొత్తవి వేశారు. లూజ్లైన్లను సరి చేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం న్యూరాంపూర్లో ఎమ్మెల్యే జోగు రామన్న, నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని భోసి గ్రామంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పల్లె ప్రగతిలో పాల్గొన్నారు. అదేవిధంగా దండేపల్లి మండలంలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని చింతకర్రలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, తిర్యాణి మండలంలోని గుండాల, మాణిక్యాపూర్, మంగీ గ్రామాల్లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి ప్రగతి పనులను పరిశీలించారు.
ఆదిలాబాద్ ప్రతినిధి/ మంచిర్యాల, జూన్ 11, (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా చేపట్టిన ఐదో విడుత పల్లె, నాలుగో విడుత పట్టణ ప్రగతి పండుగలా సాగుతున్నది. ఆదిలాబాద్ రూరల్ మండలం న్యూరాంపూర్లో ఎమ్మెల్యే జోగు రామన్న అధికారులతో కలిసి ప్రకృతివనం, నర్సరీలను పరిశీలించారు. పవర్ వీక్‌లో భాగంగా ఇంద్రవెల్లి మండలం కేంద్రంలో విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ అధికారులు సరి చేశారు. పారిశుధ్య పనులు చేసి సీసీ రోడ్లను శుభ్రం చేశారు. మురుగు కాలువల్లో చెత్తతోపాటు పూడిక తీశారు. నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని భోసి గ్రామంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే ఉన్నారు.
దండేపల్లిలో పల్లె ప్రగతి కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తో కలిసి పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంచిర్యాల జిల్లాకేంద్రంలోని 10,11,28వ వార్డులను మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కమిషనర్ బాలకృష్ణ సందర్శించారు. బెల్లంపల్లిలోని 8,32 వార్డుల్లో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కమిషనర్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని చింతకర్రలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు పర్యటించారు. తిర్యాణి మండలంలోని గుండాల, మాణిక్యాపూర్, మంగీ గ్రామాల్లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి ప్రగతి పనులను పరిశీలించారు.