ఆదిలాబాద్ రూరల్, జూన్ 11 : హజ్‌కు వెళ్లే యాత్రికులు తమ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్‌లోని ప్రైవేట్ గార్డెన్లో హజ్‌యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. వైద్యసిబ్బంది హజ్‌యాత్రికులకు వ్యాక్సినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో హజ్ భవన నిర్మాణానికి రూ.17 కోట్లు మంజూరయ్యాయని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఏడాది 127 మంది జిల్లా నుంచి హజ్‌యాత్రకు వెళ్తున్నారని తెలిపారు. వారికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. దేశంలో శాంతి కోసం హజ్‌కు వెళ్తున్నవారికి శుభాక్షాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, హజ్ సొసైటీ అధ్యక్షుడు సాహెద్ అహ్మద్ తవక్కల్, నాయకులు సలీం పాషా, అబ్దుల్ షాయిబ్, ఏజాజ్. తదితరులు పాల్గొన్నారు.