ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆదివారం నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. కాగా, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కలిపి 216 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 49,616 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పేపర్1, పేపర్ 2 పరీక్షను ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించనున్నారు.
నిర్మల్ అర్బన్, జూన్ 11 : రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్దసంఖ్యలో ఉద్యోగార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1, పేపర్-2 కలిపి 216 కేంద్రాల్లో మొత్తం 43,324 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంట ల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 33 పరీక్షా కేంద్రాల్లో 12,563 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. నిమిషం నిబంధనను ప్రభు త్వం అమలు చేయనుండడంతో అ భ్యర్థులు గంట ముందుగా నే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల నిర్వహణకు ఆయా జిల్లాల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా.. ప్రతి కేంద్రాన్ని చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు పర్యవేక్షించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అ భ్యర్థులందరి హాల్‌టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉండగా.. ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసేందుకు ప్రతి జిల్లాకు హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ అధికారి, 20 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు. ఒక్కో పరీక్షా కేంద్రంలో మొత్తం 240 మంది అభ్యర్థులలు పరీక్ష రాయనున్నారు. విద్య, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసు శాఖ ఇలా అనేక శాఖల సమన్వయంతో పరీక్షను ప్రశాంతంగా నిర్వహించనున్నారు. ప్రతి కేంద్రంలోని గదిలో ఫ్యాన్లు, తాగునీటి సదుపాయం, ఆరోగ్య సిబ్బంది, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అం దుబాటులో ఉంచనున్నారు. పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. జిల్లాలో నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్‌లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రానికి 420 మంది అభ్యర్థులను మాత్రమే కేటాయించారు.
టెట్కుకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో హాజరవుతున్న నేపథ్యం లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పట్టణాల్లోని పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ సర్వీసులను నడుపుతున్నది. నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జి ల్లాలతో పాటు నిజామాబాద్ జిల్లాకూ ప్రత్యేక సర్వీసులు ఏ ర్పాటు చేయనున్నది. రిజర్వేషన్ సదుపాయాన్ని సైతం కల్పించారు. అభ్యర్థులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డిపో సిబ్బంది సూచిస్తున్నారు.
టెట్‌ను పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో రవీందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రా న్ని శనివారం ఆయన పరిశీలించారు. పరీక్షా కేంద్రంలోని వసతులు, ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అ నంతరం కళాశాలలో ఏఈ లు, డీవోలు, సూపరింటెండెంట్లతో సమీక్ష నిర్వహించా రు. పరీక్ష మార్గదర్శకాలను వివరించారు. పరీక్షల నిర్వాహకులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, జూన్ 11 : కలెక్టర్ కార్యాలయంలో టెట్ సామగ్రి పంపిణీ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ రాంబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయా కేంద్రాలకు అవసరమైన సామగ్రిని పంపిణీ చేశారు. పరిశీలకులు పరీక్షా కేంద్రాలను పరిశీలించాలని సూచించారు. విద్యాశాఖ అధికారులు పద్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, జూన్ 11: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2022 నిర్వహణకు అన్ని రకాల జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పేపర్-1కు 1,680 మంది, పేపర్-2కు 2,926 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరి కోసం ఆదిలాబాద్‌తో పాటు ఉట్నూర్‌లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అభ్యర్థులు పరీక్ష సమయం కంటే గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని డీఈవో టామ్నె ప్రణీత తెలిపారు. జిల్లా కేంద్రంలోని విజేత జూనియర్ కళాశాల, పాత నానాపటేల్ కళాశాల బస్టాండ్ ముందు ఉందని గమనించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకోసం టోల్ ఫ్రీం నంబర్ 08732-226434లో సంప్రదించాలని సూచించారు. మం చిర్యాల జిల్లావ్యాప్తంగా 81 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 19,093 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఆసి ఫాబాద్ జిల్లాకేంద్రంలో 10, కాగజ్‌నగర్‌లో 11 కేంద్రాలు ఏర్పాటు చేయగా, 7,062 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజ రుకానున్నారు.