మంచిర్యాలటౌన్, జూన్ 4 : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు అశోక్‌రోడ్, రెండో వార్డు దొరగారిపల్లిలో ప్రజాప్రతినిధు లు, అధికారులు పర్యటించారు. 16వ వార్డులో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్ బోరిగం శ్రీనివాస్, కమిషన ర్ ఎన్ బాలకృష్ణ ఇంటింటికీ తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పారిశుధ్యం, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలను పలువురు నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన అధికారులు.. అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఏఈ నర్సింహస్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్‌రాథోడ్, కోఆప్షన్ సభ్యుడు రమేశ్, మాజీ కౌన్సిలర్ శ్రీపతివాసు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పల్లపు తిరుపతి, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
హాజీపూర్, జూన్ 4 : గ్రామాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రతిరోజూ పారిశుధ్య పనులు నిర్వహించాలని మండల అభివృ ద్ధి అధికారి అబ్దుల్ హై అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భా గంగా ఎంపీవో శ్రీనివాస్ రెడ్డి, ఏపీవో మల్లయ్యతో కలిసి టీకన్నపల్లి గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు. నిత్యం గ్రా మాల్లో పారిశుధ్య పనులు నిర్వహించాలని పేర్కొన్నారు. స ర్పంచ్, పంచాయతీ కార్యదర్శి హారిక ఉన్నారు.
లక్షెట్టిపేట, జూన్ 4 : లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో పట్టణ ప్రగతి రెండో రోజూ కొనసాగింది. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. నాల్గో విడుత హ రితహారం సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంత య్య, కమిషనర్ వెంకటేశ్ గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగింపజేశారు. వాటర్ ట్యాంక్‌లను శుభ్రం చేసి బ్లీచింగ్ చేశారు. కాలనీల్లో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు ఉమాదేవి, శ్రీకాంత్, సురేశ్ నాయక్, చాతరాజు రాజన్న, సుధాకర్, కోఆప్షన్ సభ్యులు నూనె ప్రవీణ్, షాహిద్ అలీ, మున్సిపల్ మేనేజర్ శ్రీహరి, ఏఎన్ఎంలు ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
దండేపల్లి, జూన్ 4 : పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డీఆర్డీఏ ఏపీడీ సదానందం అన్నారు. మండలంలోని తాళ్లపేటలో నిర్వహిస్తున్న పల్లె ప్రగతిని శనివారం తనిఖీ చేశారు. ఇళ్లముందు, దుకాణా సముదాయాల ముందు చెత్త పడేస్తే నోటీసులు జారీ చేసి, జరిమానాలు విధించాలన్నారు. అనంతరం తాళ్లపేటలో నర్సరీని సందర్శించారు. మొక్క ల పెంపకంపై సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ ప్రత్యేకాధికారి శిరీష, సర్పంచ్ కుర్సెంగ కళావతి, ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి, జీపీ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్, జూన్ 4 : క్యాతనపల్లి మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కొనసాగింది. 22 వార్డుల్లో మురుగు కాలువలను శుభ్రం చేశారు.10వ వార్డులోని కుర్మపల్లిలో పిచ్చి మొక్కలను తొలగించారు. క్యాతనపల్లి, కుర్మపల్లి మధ్యన చెరువు కట్టపై పెరిగిన చెట్ల పొదలను జేసీబీతో శుభ్రం చేయించారు. కమిషనర్ వెంకటనారాయణ, వార్డు కౌన్సిలర్ పనాస రాజు పర్యవేక్షించారు. 14వ వార్డులో పట్టణ ప్రగతిపై ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ మేనేజర్ నాగరాజు, వార్డు కౌన్సిలర్ గడ్డం విజయలక్ష్మి, నాయకుడు గడ్డం రాజు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మండలంలోని పులిమడుగు గ్రామంలో పల్లె ప్రగతిపై ప్రజలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ భూక్యాదేవి, కార్యదర్శి ఆసంపెల్లి సురేశ్ పాల్గొన్నారు.
కోటపల్లి, జూన్ 4 : కోటపల్లి మండలంలో గ్రామ సర్పంచ్‌లు, ప్రత్యేకాధికారులు, ప్రత్యేకాధికారులు ఇంటింటికీ తిరిగి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కోటపల్లి, ఎసన్వాయి గ్రామాల్లో ఎంపీపీ మంత్రి సురేఖ, ఎంపీడీవో కే భాస్కర్ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి ఆవశ్యకత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. సర్పంచ్‌లు రాగం రాజక్క, సీమానాయక్, పంచాయతీ కార్యదర్శి తాజొద్దీన్ పాల్గొన్నారు.
భీమారం, జూన్ 4 : మండలంలోని మద్దికల్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. నాళాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ నర్సరీని పరిశీలించారు. హరితహారానికి మొక్కలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
కాసిపేట, జూన్ 4 : మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల్లో రెండో రోజూ పల్లె ప్రగతి కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. పారిశుధ్య పనులు చేపట్టారు. రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించారు. ఎంపీడీవో అలీం, తహసీల్దార్ దిలీప్ కుమార్ కొమటిచేను, కోనూర్, తాటిగూడ, ధర్మారావుపేట జీపీల్లో క్రీడా ప్రాంగణాల కోసం స్థలాలను పరిశీలించారు.
నెన్నెల, జూన్ 4 : మండంలలోని నందులపల్లి గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి శేషాద్రి పర్యటించారు. పరిశుభ్రతపై గ్రామస్తులకు వివరించారు. మండలంలోని ఆయా జీపీల్లో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు కొనసాగింది.
తాండూర్, జూన్ 4 : మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి పనులు కొనసాగాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు ఉదయం గ్రామ సభలు నిర్వహించిన అనంతరం అధికారులు, వార్డు సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు, స్థాయీ సంఘాల కమిటీల సభ్యులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గ్రామాల్లోని వార్డుల్లో పాదయాత్ర నిర్వహించారు. తాండూర్‌లో స్పెషల్ ఆఫీసర్ గజానంద్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంపీవో సత్యనారాయణ పనులను పర్యవేక్షించారు. సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యదర్శులు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, వెలుగు సీఏలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు.
వేమనపల్లి, జూన్ 4 : వేమనపల్లితో పాటు గొర్లపల్లి, నాగా రం, సూరారం, సుంపుటం తదితర గ్రామాల్లో పల్లె ప్రగతి పను లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సూరారం, నాగారం గ్రా మాల్లో ప్రత్యేకాధికారులైన ఎంపీవో బాపురావు, ఆర్ఐ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రోడ్లకిరువైపులా ఉన్న మురుగు కాలువల్లో పూడిక తీయించారు. పిచ్చి మొక్కలు తొలగింపజేశారు. పనులను ఎంపీడీవో లక్ష్మయ్య పరిశీలించారు. సర్పంచులు కుబిడె మధుకర్, తలండి స్వరూపారాణి, పల్లె రమేశ్‌గౌడ్, బాపు, పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్, సంతోష్‌రెడ్డి, శ్యాం, వీఆర్వో నారాయణ, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ, ఉపసర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
బెల్లంపల్లిరూరల్, జూన్ 4: మండలంలోని లింగాపూర్ గ్రా మపంచాయతీని కలెక్టర్ భారతీ హోళికేరి సందర్శించారు. పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించారు. స్థానికంగా పెంచుతున్న మొక్కల వివరాలను ఆమె సర్పంచ్ కారుకూరి వెంకటేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తిరుగుతూ ఇంకుడు గుంతలు, మురు గు కాల్వలను పరిశీలించారు. వైకుంఠధామం, డంప్ యార్డ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని సర్పంచ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ఆర్డీవో శ్యామలాదేవికి సూచించారు. ఎంపీడీవో డీ రాజేందర్, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో జీనత్, ఆకెనపల్లి ఎంపీటీసీ పొట్లపల్లి సుభాష్రావ్ పాల్గొన్నారు.