ఇంద్రవెల్లి, జూన్ 4 : పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల ప్రజ లు విన్నవించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి పనులు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండలంలోని ఈశ్వర్నగర్, దోడంద గ్రామపంచాయతీల పరిధిలో శనివారం నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. స్థానిక సర్పంచ్లు రాథోడ్ శారద, నాగోరావ్, కుమ్ర మోహన్రావ్, ప్రజలు పలు రకాల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటింటా మరుగుదొడ్లతో పాటు ఇంకుడు గుంతలు నిర్మించాలన్నారు. నిత్యం పరిశుభ్రత పాటించాలన్నారు. ఈశ్వర్నగర్లో అంగన్వాడీ, పాఠశాల భవనాల మంజూరుకు కృషిచేస్తామన్నారు. సంబందిత శాఖల అధికారులు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రేఖానాయక్ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణలో అమలవుతున్నాయన్నారు.
గ్రామాల్లో శుభ్రత పాటించి, విషజ్వరాలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, డీఆర్డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎస్ఈ ఉత్తజాడే, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, పీఏసీఎస్ చైర్మన్ మారుపతి పటేల్ డోంగ్రె, ఏ ఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, విద్యుత్ శాఖ డీఈ సు భాష్, ఏఈ చంద్రశేఖర్, డీఎల్పీవో భిక్షపతి గౌడ్, తహసీల్దార్ సోము, ఎంపీడీవో పుష్పలత,ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, కుమ్ర జంగుబాయి, గిత్తే ఆశాబాయి, కోవ రాజేశ్వర్, సర్పంచులు రాథోడ్ శారద, నాగోరావ్, కుమ్ర మోహన్రావ్, ఎంపీవో సం తోష్, టీఆర్ఎస్ నాయకులు షేక్ సుఫియన్, కనక హనుమంత్రావ్, నగేశ్, రాందాస్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 4 : మండలంలోని జైత్రాం తండాలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పర్యటించారు. గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామస్తులు వారి సమస్యలను కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వారి వెంట ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాం జాదవ్, ఎంపీడీవో తిరుమల, ఏపీవో రజనీనీకాంత్, సర్పంచులు, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు రషీద్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అజీమొద్దీన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.