నిర్మల్ అర్బన్, జూన్ 4 : నిర్మల్ ప్రాంతానికి చెందిన నిరంజన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికవడం రాష్ర్టానికే గర్వకారణమని బార్ అసోసియేషన్ అధ్యక్షు డు అల్లూరి మల్లారెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్ హాలులో శనివారం రాత్రి ఆయనకు పౌర సన్మానం ని ర్వహించారు. అంతకుముందు నిరంజన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరంజన్‌రెడ్డి చేసిన పలు సామాజిక సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, నిరంజన్‌రెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పలు ప్రాంతాల నుంచి వచ్చిన న్యాయవాదులు, వివిధ సంఘాల నాయకులు ఉద్యోగులు ఆయనను సత్కరించారు. అయ్యన్నగారి భూమయ్య, ఎంసీ లింగన్న, చెనిగారపు చిన్నయ్య, ప్రభాకర్, పోశెట్టి, అప్పాల చక్రధరి పాల్గొన్నారు.
నిర్మల్ చైన్‌గేట్, జూన్ 4 : రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై మొదటిసారిగా నిర్మల్‌కు వచ్చిన నిరంజన్‌రెడ్డికి టీఆర్ఎస్ మంజులాపూర్ నాయకులు, న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. నిర్మల్ నుంచి సిర్గాపూర్ వెళ్తుండగా, మంజులాపూర్‌లో బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. నాయకులు ఐండ్ల పోశెట్టి, నరేశ్‌రెడ్డి, రమణాగౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, జూన్ 4 : ఎస్ నిరంజన్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణగౌడ్, పలువురు నాయకులు ఘనంగా సన్మానించారు. శనివారం నిర్మల్‌కు వచ్చిన నిరంజన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. నిర్మల్‌కు చెందిన న్యాయవాదికి ఇంత గుర్తింపు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. నిర్మల్ మండల మాజీ అధ్యక్షుడు అయిండ్ల పోశెట్టి, టీఆర్ఎస్ సోన్ మండల అధ్యక్షుడు మోహినొద్దీన్, మేక రాజేందర్‌యాదవ్, రాజనర్సయ్య, బర్మదాసు, శంకర్, రమణగౌడ్ పాల్గొన్నారు.