ఆదిలాబాద్ టౌన్, జూన్ 4 : ఆదిలాబాద్ లో సీసీఐని మూతపడగొట్టి, దాని యంత్ర సా మగ్రిని తుక్కుకింద అమ్మాలనుకోవడం కేం ద్రంలోని బీజేపీ సర్కారు పనితనానికి నిదర్శనమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని శనివారం స్థానిక నాయకులు, సాధ న కమిటీతో కలిసి ఆయన సందర్శించారు.
ర్యాలీలో పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ఒక పరిశ్రమకు భూసేకరణ చేసినపుడు, స్థానికులతో చే సుకున్న ఒప్పందం మేరకు నడుపాల్సి ఉం టుందన్నారు. ఒక వేళ నష్టాల్లో ఉంటే సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని పేర్కొన్నారు. ఈ సీసీఐలో 65 ఏండ్లకు సరిప డా ముడిసరుకు ఉన్నదని, మరో పక్క తెలంగాణ సర్కారు కృషితో విద్యుత్, నీటి లభ్యత ఉన్నాయని చెప్పారు.
బొగ్గుగనులు కూడా అం దుబాటులో ఉన్నాయని, ఏ వేళనైనా సిమెంటుకు డిమాండ్ ఉంటుందని చెప్పారు. ఉత్ప త్తి, ఎగుమతికి ఆదిలాబాద్ గుండా జాతీయ రహహదారి, రైల్వే మార్గాలు ఉన్నాయని, ఇన్ని వనరులు, అవకాశాలు ఉండగా కేంద్రానికి మతిపోయిందా అన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ పునరుద్ధరణ కోసం రాష్ట్రం పాతబకాయిలు రద్దుచేసి కొత్తపరిశ్రమల రాయితీ, 49 శాతం వాటా ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగిస్తే నడిపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం సాహసోపేతమని కొనియాడా రు. ఇందుకు సీఎం కేసీఆర్కు అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్, కో-కన్వీనర్ విజ్జగిరి నారాయణ, నాయకులు అరుణ్, కొండ రమేశ్, కిరణ్, సచిన్, వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.