నార్నూర్, జూన్ 3 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎవరూ సాటి రారని ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని మాన్కాపూర్ గ్రామంలో శుక్రవారం పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి ఆయన పాల్గొన్నారు. వీరికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. స్థానిక హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. మందిర ప్రాంగణంలో మొక్క నాటారు. అనంతరం నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని పరిశీలించారు.
వీధులో తిరుగుతూ ప్రజ లు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామం లో ఏర్పాటు చేసిన గ్రామసభలో పంచాయతీ అభివృద్ధి, నిధుల వినియోగంపై కార్యదర్శి లవ్‌కుమార్ వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలోలేని సంక్షేమం, అభివృద్ధి మన రాష్ట్రంలో కళ్లముందే కనిపిస్తుందన్నారు. ప్రతిపక్ష నాయకులు మాయమాటలు చెప్పి నమ్మిస్తూ మోసం చేస్తారని. పత్తాలేని నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. పచ్చదనం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు.
మండలంలోని తాడిహత్నూర్‌లో సర్వే నం.38లోని భూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఏజెన్సీలోని అన్నివర్గాల ప్రజలు వ్యవసాయంతో పాటు విద్యాపరంగా ముందుకెళ్లాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు సూచించారు. రోడ్డు, వ్యవసాయ భూములు, పోడు భూముల సమస్య పరిష్కరించడంతో పాటు చెరువుల వద్ద కెనాల్ మరమ్మతులు చేపట్టితే రైతులకు మేలు చేకూరుతుందన్నారు.
ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, పంచాయతీ రాజ్‌శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్, డీఆర్డీవో కిషన్, ఎంపీపీ కనక మోతుబాయి, డీఎల్పీవో భిక్షపతిగౌడ్, తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్, ఎంపీడీవో రమేశ్, సర్పంచ్ రాథోడ్ సావీందర్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ తోడసం నాగోరావ్, మాజీ ఎంపీపీ మెస్రం రూప్‌దేవ్, ఎంపీవో స్వప్నశీల, ఆయాశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.