ముథోల్, జూన్ 3 : పేదలకు కల్యాణలక్ష్మి వరం లాంటిందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్‌లోని జీఎం ఫంక్షన్ హాల్లో శుక్రవారం 115 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేకూరుతుందని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదలు లబ్ధి పొందుతున్నారన్నారు.
సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీపీ అయేషా అఫ్రోజ్ ఖాన్, రైతుబంధు సమితి అధ్యక్షుడు రాంరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, తహసీల్దార్ శ్యాంసుందర్, ఆర్ఐ అభిమన్యు, నాయకులు మురళి, రవి కిరణ్ గౌడ్, రవి కుమార్, సత్యనారాయణ, రమేశ్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.