కోటపల్లి, జూన్ 2 : మండలంలో నిర్వహించిన వేడుకల్లో సీఐ విద్యాసాగర్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మంత్రి సురేఖ, తహసీల్దార్ సునీల్ దేశ్‌పాండే, పీహెచ్సీలో వైద్యాధికారి సత్యనారాయణ, సర్పంచ్ రాగం రాజక్క, వ్యవసాయ శాఖ ఏవో మహేందర్, ఎంఈవో మహేందర్, పీఏసీఎస్ చైర్మన్ సాంబాగౌడ్, జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం బాణాల లక్ష్మీనారాయణ, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీరెడ్డి, కస్తూర్బా విద్యాలయ అధికారిని రేఖా, ఎంపీడీవో కే భాస్కర్, ఎస్ఐ వెంకట్, ఎంపీవో అక్తర్ మొహియొద్దీన్, ఏపీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
భీమారం, జూన్ 2 : మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ వాసంతి, భీమారం సర్పంచ్ గద్దెరాంరెడ్డి , టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పర్తిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు బాబర్ ఖాన్, నాయకులు దాసరి మధునయ్య, పోడెటి రవి, జర్పుల రాజ్ కుమార్ నాయక్, జలంపల్లి సమ్మయ్య, జలంపల్లి తిరుపతి, ఆత్కూరి రాము ,వడ్ల కొండ కిష్టయ్య, దాసరి మణిదీపక్ , సుం కరి భూమేశ్ , సుంకరి గోపాల్ తదితరులున్నారు.
లక్షెట్టిపేట, జూన్ 2 : పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు, జూనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, ఇన్చార్జి తహసీల్దార్ సనత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, ఎంపీపీ మంగ, ఐసీడీఎస్ సూపర్వైజర్ దీపా వాహిని, ఏవో ప్రభాకర్, సూపరింటెండెంట్ శేఖర్, వివిధ పార్టీలు, సంస్థల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చెన్నూర్, జూన్ 2 : పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ అర్చనా గిల్డా, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు దేశ్‌పాండే, ఎంపీపీ మంత్రి బాపు, మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్ దోమకొండ అనిల్, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
నెన్నెల, జూన్ 2: నెన్నెల మండలంలో నిర్వహించిన వేడుకల్లో తహసీల్దార్ భూమేశ్వర్, ఎంపీపీ రమాదేవి, ఎస్ఐ రాజశేఖర్, ఎంఈవో నారాయణ, ఏడీఏ ఇంతియాజ్ అహ్మద్ అటవీ రేంజర్ గోవింద్ చంద్, హెచ్ఎం నారాయణ, పీఏసీఎస్ చైర్మన్ మేకల మల్లేశ్, నెన్నెల సర్పంచ్ తోట సూజాత , టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాగర్‌గౌడ్, ఎంపీడీవో వరలక్ష్మి, ఆర్ఐ గణేశ్, ఎంపీవో శ్రీనివాస్, రైతు బంధు సమితి అధ్యక్షుడు అశోక్‌గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ కొయ్యడ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీలు తిరుపతి, కమల, మండల కో ఆప్షన్ ఇబ్రహీం, టీఆర్ఎస్ నాయకులు రాంచందర్, ప్రతాప్ రెడ్డి, తదితరులున్నారు.
బెల్లంపల్లి టౌన్, జూన్ 2 : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, టీబీజీకేఎస్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, 26వ వార్డులో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ నాయకుడు గెల్లి రాజలింగు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, ఏఎంసీ చైర్మన్ గడ్డం పావని కల్యాణి, నియోజకవర్గ అధికార ప్రతినిధి కొమ్మెర లక్ష్మణ్, కౌన్సిలర్లు రాజనాల కమల, లీలావతి, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు గడ్డం భీమాగౌడ్, నెల్లికంటి శ్రీధర్, బడికెల రమేశ్, తదితరులు పాల్గొన్నారు.
తాండూర్, జూన్ 2 : మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, తహసీల్దార్ కవిత, ఎంఈవో ప్రభాకర్, తాండూర్ సర్కిల్ పోలీసు కార్యాలయంలో సీఐ జగదీశ్, ట్రాన్స్‌కో కార్యాలయంలో ఏఈ ప్రభాకర్, వ్యవసాయ కార్యాలయంలో ఏవో కిరణ్మయి, డీఈ గిరీశ్‌బాబు, తాండూర్, మాదారం పోలీస్స్టేషన్లలో ఎస్ఐలు, సర్పంచ్‌లు, ప్రధానోపాధ్యాయులు, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
దండేపల్లి, జూన్ 2: మండలంలో నిర్వహించిన వేడుకల్లో తహసీల్దార్ హన్మంతరావు, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, సర్పంచ్ చంద్రకళ, ఎస్ఐ సాంబమూర్తి, గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, సర్పంచ్‌లు టీఆర్ఎస్ నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు.
హాజీపూర్, జూన్ 2 : మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత, వ్యవసాయ అధికారి రజిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్, ఉద్యోగులు, మహిళా సమాఖ్య సభ్యులు, రాపల్లి సర్పంచ్ ఆనె మల్లేశ్, హాజీపూర్ సర్పంచ్ జూపాక రాజేశ్వరీ, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు నయిం పాషా, పీఏసీఎస్ చైర్మన్లు మల్రాజు రామారావు, కొట్టె సత్తయ్య, ఎంపీటీసీ సోగాల సుజాత-కిష్టయ్య, సర్పంచ్‌లు ఫోరం మండల అధ్యక్షుడు గొళ్ళ శ్రీనివాస్, మండల టీఆర్ఎస్వై ప్రధాన కార్యదర్శి గుండా హరీశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ సాగి వెంకటేశ్వర రావు, మాజీ వైస్ ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్, నాయకులు మల్రాజ్ సునీల్ రావు, సామల బుచ్చయ్య కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవో) జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయగీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్, భూముల రామ్మోహన్, సతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లిరూరల్, జూన్ 2: మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ గోమాస శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, వైస్ ఎంపీపీ వెంబడి రాణి, ఎంపీడీవో డీ రాజేందర్, ఎంపీవో వెదల శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ కొండయ్య, టీఆర్ఎస్ నాయకులు వినోద్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల (సీవోఈ) లో ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ఉపాధ్యాయులు, అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు.
వేమనపల్లి, జూన్ 2 : మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ ఆత్రం గణపతి, ఎంపీడీవో లక్ష్మయ్య, తహసీల్దార్ రాజ్‌కుమార్, వైద్యుడు కృష్ణ, ఏఈవో సంతోష్, రుక్సార్ సుల్తానా, ఎఫ్ఆర్వో ఇక్బాల్ హుస్సేన్, డిప్యూటీ రేంజర్ బాబు పటేకర్, ఎస్ఐ నరేశ్, ఎంఈవో తిరుపతిరెడ్డి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోలి వేణుమాధవ్‌రావు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికులను సర్పంచు కుబిడె మధుకర్, ఎంపీడీవో లక్ష్మయ్య, ఎంపీపీ ఆత్రం గణపతిలు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
కన్నెపల్లి, జూన్ 2 : కన్నెపల్లి, భీమిని మండలాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కన్నెపల్లి తహసీల్దార్ రాంచందర్, ఎంపీడీవో రాధాకిషన్, పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ సురేశ్ వర్మ, ఏఈవోలు, సర్పంచులు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాయిని రంగారావు జడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ, ఎంపీటీసీ నెండుగూరి భారతి, సర్పంచు పుల్లూరి సురేఖ, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. గొల్లగట్టు, నాయకుడిపేట గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను అధికారులు, నాయకులు ప్రారంభించారు.
మందమర్రి, జూన్ 2: మందమర్రి మున్సిపల్ ప్రత్యేక అధికారి, జడ్పీ సీఈవో కే నరేందర్, డాక్టర్ శైలజ, విద్యుత్ శాఖ ఏఈ మహేందర్‌రెడ్డి, దీపక్‌నగర్ పీహెచ్సీ డాక్టర్ శివప్రతాప్, సీఐ ప్రమోద్‌రావు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. టీబీజీకేఎస్ కార్యాలయంలో కేక్‌కట్ చేశారు. టీఆర్ఎస్ బీ1 కార్యాలయం ఎదుట పతాకాన్ని ఆవిష్కరించారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జే రవీందర్, మేడిపల్లి సంపత్, బడికెల సంపత్, వో రాజశేఖర్, బోరిగం వెంకటేశ్, భట్టు రాజ్‌కుమార్, తోట సురేందర్, రాకం సంతోష్, మాసు వెంకటేశ్, వివిధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాసిపేట, జూన్ 2 : మండలంలోని దేవాపూర్‌లో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో 2000 సంవత్సరానికి ముందు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను సన్మానించారు. జేఏసీ కన్వీనర్ కేశవరావు, ఆదివాసీ జేఏసీ కన్వీనర్ కొమ్ముల బాపు, నాయకులు భూమన్న, మేరుగు మల్లేశ్, సంగీతను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు పల్లె మల్లయ్య, ఉపాధ్యక్షుడు మెరుగు శంకర్, మహేశ్వర్, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్, జూన్ 2:మండలంలో నిర్వహించిన వేడుకల్లో పొక్కూర్. రచ్చపల్లి, కిష్టంపేట, ముత్తరావుపల్లి, కొమ్మెర, బీరెల్లి, కత్తరశాల, అక్కెపల్లి, సుందరశాల, ఓత్కులపల్లి, చెల్లాయిపేట, సంకారం, ఆస్నాద్, నాగాపూర్, సోమన్‌పల్లి గ్రామాల్లో సర్పంచ్‌లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు కుక్కడపు నరేందర్, అయిత పార్వతి, అన్నల మా నస, పాగె రాజమల్లు, డెబ్బ రవీందర్, చెడెంక పున్నం, భీమిని శారద, ముత్యాల మౌనిక, మడక స్వప్న, బుర్ర రాకేశ్ గౌడ్, తోట మధూకర్, మాడ సుమలత ఉప సర్పంచ్ నస్కూరి శ్రీనివాస్, నాయకులు అయిత సురేశ్ రెడ్డి, భీమిని శ్రీనివాస్ గౌడ్, నరసింహచారి, మాడ మాధవ రెడ్డి, భీమిని సా రయ్య గౌడ్, తిరుపతి, కార్యకర్తలున్నారు.
మంచిర్యాల ఏసీసీ, జూన్ 2 : కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగస్తుల విషయంలో చాలా మేలు జరుగుతుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీసీఎఫ్ ఎఫ్డీపీటీ సీపీ వినోద్ కుమార్ అన్నారు. మంచిర్యాల డీఎఫ్‌వో కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీఎఫ్‌వో శివానీ డోగ్ర, ఎఫ్‌డీవో వినయ్ కుమార్ సాహూ, చెన్నూ రు ఎఫ్‌డీవో రమేశ్, ఎఫ్ఆర్వోలు, డీఆర్వోలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల అర్బన్, జూన్ 2 : మంచిర్యాలలో లైబ్రెరీలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మార్కెట్ కమిటీ ఆవరణలో చైర్మన్ పల్లె భూమేశ్, పీఏసీఎస్‌లో చైర్మన్ సందెల వెంకటేశ్, డీఏవో కల్పన, డీఈవో వెంకటేశ్వర్లు, డీఐఈవో శైలజ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ రవి కుమార్, తదితరులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.