మంచిర్యాలటౌన్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బైపాస్‌రోడ్డులోని రాళ్లవాగు వద్ద అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, కలెక్టర్ భారతీ హోళికేరి, మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్‌చైర్మన్ ముఖేశ్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు అత్తి సరోజ, మామిడిశెట్టి వసుంధర, రవికుమార్, గోగుల రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్ సుధామల్ల హరికృష్ణ, గాదెసత్యం, మాధవి, ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ నివాళులర్పించారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, ఏఈ మధూకర్, ఏఈ నర్సింహాస్వామి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సీసీసీ నస్పూర్, జూన్ 2: నస్పూర్‌కాలనీలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే దివాకర్‌రావు పాలాభిషేకం చేసి, పూలమాల వేశారు. అమర వీరులకు నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, కార్యదర్శి మెరుగు పవన్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గరిసె రామస్వామి, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు బేర సత్యనారాయణ, బోయ మల్లయ్య, ప్రకాశ్‌రెడ్డి, చిడం మహేశ్, కుర్మిళ్ల అన్నపూర్ణ, నాయకులు మోతె కనుకయ్య, చెల్ల విక్రం, ఏనుగు రవీందర్‌రెడ్డి, మంద మల్లారెడ్డి, పెర్క సత్తయ్య, పంబాల ఎర్రయ్య, అడ్లకొండ రవి, పెంచాల వేణు, జక్కుల కుమార్, తిప్పని బానేశ్, నల్లపు శ్రీనివాస్, కాటం రాజు, దగ్గుల మధు, ముక్కెర వెంకటేశ్, గర్శె భీమయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట, జూన్ 2 : రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. పట్టణ కేంద్రంలోని ఊత్కూర్ చౌరస్తాలో గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రెస్‌క్లబ్ సభ్యులతో పాటు సుమారు మరో 50 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి సంధ్యారాణి జగన్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు వికాస్, ఉపాధ్యక్షుడు అంకతి రమేశ్, నాయకులు కో ఆప్షన్ సభ్యుడు నూనె ప్రవీణ్, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కుమారస్వామి, పాత్రికేయులు ప్రసన్న, చీకటి తిరుపతి, నోవా, భాను, శ్రీకాంత్, రమేశ్, సుధాకర్, తిరుపతి పాల్గొన్నారు.
కాసిపేట, జూన్ 2 : కాసిపేట మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ రొడ్డ లక్ష్మి, తహసీల్దార్ దిలీప్ కుమార్, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రంరావు, ఎంపీడీవో ఎంఏ అలీం, సహకార సంఘం చైర్మన్ నీలా రాంచందర్, సర్పంచ్‌లు మడావి తిరుమల, ఆడె బాదు, ధరావత్ దేవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, మడావి అనంతరావు, ఏనుగు తిరుపతిరెడ్డి, అట్టెపల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచందర్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు సపాట్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్ టౌన్, జూన్ 2: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం, ఫారెస్ట్, ఎక్సైజ్, తహసీల్, ఎంఈవో , ఆర్డీవో కార్యాలయాల్లో అధికారులు, నాయకులు గురువారం జెండాలను ఎగురవేశారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే కోనప్ప జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఎంపీపీ శంకర్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ గిరీశ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసం శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
హాజీపూర్, జూన్ 2 : విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పతకాలను హాజీపూర్ మండలం, గుడిపేటలోని 13వ బెటాలియన్‌లో కమాండెంట్ రామకృష్ణ అందజేశారు. ఆర్ఐ భాస్కర్, ఏఆర్ఎస్ఐ నామ్‌దేవ్, ప్రభాకర్, మల్లేశ్, హెచ్‌సీ గురువయ్య, కానిస్టేబుల్ రమేశ్ పతకాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎంఐ సురేశ్, అసిస్టెంట్ కమాండెంట్ శరత్ కుమార్, రఘునాథ్ , ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది, యువకులు పాల్గొన్నారు. హాజీపూర్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ ఎస్కే చాంద్‌కు ఉత్తమ సేవా పతకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయనను ఎస్ఐ ఉదయ్‌కిరణ్ సన్మానించారు.
బెల్లంపల్లి టౌన్, జూన్ 2 : విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఏసీపీ ఎడ్ల మహేశ్‌కు రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సీపీ చంద్రశేఖర్‌రెడ్డి అవార్డు అందజేశారు. బెల్లంపల్లి రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఏ లక్ష్మారెడ్డి పోలీస్ సేవా పతకాన్ని అందుకున్నారు.
బెల్లంపల్లి టౌన్, జూన్ 2 : దళిత బంధు పథకం ద్వారా జేసీబీ, హార్వెస్టర్లను భీమిని మండలం వెంకటాపూర్‌కు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, భీమిని, బెల్లంపల్లి ఎంపీపీలు రాజేశ్వరి, శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఎంబడి రాణి, బుధాకుర్దు సర్పంచ్ వీ కృష్ణమూర్తి, నెన్నెల మండల అధ్యక్షుడు గడ్డం భీమాగౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్, నాయకులు ఎంబడి సురేశ్, లబ్ధిదారులు కొండగొర్ల శంకరయ్య, కోట నగేశ్, కోట పురుషోత్తం, కోట తిరుపతి, కోట శ్రీనివాస్ పాల్గొన్నారు.