నిర్మల్ అర్బన్, జూన్ 2 : కేసీఆర్ పోరాటం.. అమరుల త్యాగఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహనీయుల చిత్ర పటాలకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు. టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమెల్యే విఠల్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని రాష్ర్టాల కంటే ఎనిమిది ఏండ్ల పాలనలో తెలంగాణ ఎంతో ముందున్నదన్నారు. రానున్న రోజుల్లో రాష్ర్టాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్ రాంరెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్మాదా ముత్యంరెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, జిల్లా పరిషత్ కో ఆప్షన్ మెంబర్ సుభాష్‌రావు, టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ముడుసు సత్యనారాయణ, కౌన్సిలర్లు, నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలో గురువారం తెలంగాణ ఆవిర్భావ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించా రు. అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు మహనీయులు, తెలంగాణ అమరవీరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యాలయాల్లో ఆయా శాఖల జిల్లా అధికారులు జాతీయ జెండాలను ఎగురవేశారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము జాతీయ జెండాను ఎగురవేశారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, కౌన్సిలర్లు నేరేళ్ల వేణు, ఎడిపెల్లి నరేందర్, నల్లూరి పోశెట్టి, చాహూస్, నాయకులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహనీయుల చిత్ర పటాలకు ఎస్పీ ప్రవీణ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసు శాఖలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. అదనపు ఎస్పీ రాంరెడ్డి, భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారే, డీఎస్పీ జీవన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, జూన్ 2 : కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ జాతీ య జెండాను ఎగురవేశారు. విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. జడ్పీ కార్యాలయంలో సీఈవో సుధీర్‌కుమార్‌తో కలిసి జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి జెండాను ఆవిష్కరించారు. డిప్యూటీ సీఈవో శంకర్, నిర్మల్ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్‌రావు, జడ్పీ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనం గా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహాలతో పాటు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాపిన వారికి నివాళులర్పించారు. తోటి ఉద్యోగులకు మిఠాయిలు పంచిపెట్టారు.
మలిదశ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీతో పాటు అమరవీరుల పోరాట ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువయ్యాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలో ప్రజలకు పాలన చేరువైందని గుర్తు చేశారు. గ్రంథాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
సోన్, జూన్ 2 : నిర్మల్, సోన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్‌రెడ్డి, బర్ల మానస, పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్లు కృష్ణప్రసాద్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి, తహసీల్ కార్యాలయాల్లో హిమబిందు, ప్రభాకర్, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు మువ్వన్నెల జెండా ను ఎగురవేశారు. 8 ఏళ్ల తెలంగాణలో ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి మిఠాయిలు పంచి పెట్టారు.
సారంగాపూర్, జూన్ 2 : మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, ఆయా కార్యాల యాల్లో అధికారులు, జీపీల్లో సర్పంచ్‌లు , ఉన్నత పాఠశాలలో హెచ్ఎం విద్యాసాగర్ జెండాలను ఎగుర వేశారు. జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, టీ ఆర్ఎస్ మండల కన్వీనర్ మాధవరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లయ్య, ఎంపీటీసీలు వెంకట రమణారెడ్డి, పద్మ, నాయకులు రాజ్‌మహ్మద్, శ్రీనివాస్‌రెడ్డి, గంగారెడ్డి, ఇస్మాయిల్, దేవిశంకర్, నర్సారెడ్డి, లక్యానాయక్, ఎంపీడీవో సరోజ పాల్గొన్నారు.
మామడ, జూన్ 2 : మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రొ.జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఎంపీపీ అమృత, తహసీల్దార్ కిరణ్మయి, ఎంపీడీవో మల్లేశం, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
లక్ష్మణచాంద, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అడ్వాల పద్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మువ్వన్నెల జెండాను ఎగుర వేశారు. జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, ఎంపీడీవో శేఖర్, ఎంపీవో నసీరొద్దీన్, పొట్టపెల్లి సర్పంచ్ హైమావతి, నాయకులు అడ్వాల రమేశ్, సాతం గంగారాం, ఆయాగ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దిలావర్పూర్, జూన్ 2 : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దిలావర్పూర్ మండల పరిషత్ కార్యలయంలో ఎంపీపీ పాల్ధే అక్షర, ఆయా కార్యాలయాల్లో అధికారులు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గంగాధర్, ఆయా గ్రామాల్లో సర్పంచులు ఓడ్నం సవిత, వీరేశ్‌కుమార్, అడెపు తిరుమల, తక్కల సంగీత, పద్మ జాతీయ జెండా ఆవిష్కరించారు.
నిర్మల్ చైన్‌గేట్, జూన్ 2 : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో డీఎంహెచ్‌వో ధన్‌రాజ్, ఎంసీహెచ్‌లో డాక్టర్ రజని, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో డీడబ్ల్యూవో విజయలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయంలో డీఆర్డీవో విజయలక్ష్మి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా.. జిల్లా ప్రధాన దవాఖానలో థియేటర్ అసిస్టెంట్ మల్లన్న రిటైర్మెంట్ ఉండడంతో సూపరింటెండెంట్ దేవేందర్‌రెడ్డి సూచన మేరకు ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
భైంసా, జూన్ 2 : భైంసా పట్టణంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యాలయాల్లో అధికారులు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఫారుఖ్ హైమద్, బీజే పీ, కాంగ్రెస్ కార్యాలయాల్లో ఆయా పట్టణాధ్యక్షులు జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ తల్లి, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆసిఫ్, టీఆర్ఎస్ నాయకులు తోట రాము, మురళీగౌడ్, రమేశ్ మాశెట్టివార్, విలాస్ గాదేవార్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
భైంసాటౌన్, జూన్ 2 : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కల్పనా జాదవ్ జాతీయ జెండాను ఎగురవేశారు. వానల్‌పాడ్‌లో సర్పంచ్ మాన్కుర్ రాజన్న, మహాగాంలో అప్పాల రాకేశ్, లింగాలో దుప్పె గణేశ్, వాలేగాంలో అనసూయ, దేగాంలో బొబ్బిలి శ్రీనివాస్, మహాగాం పీహెచ్సీలో వైద్యుడు శ్రీకాంత్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎంపీడీవో గంగాధర్, ఎంపీవో మోజా మ్ హుస్సేన్, కోఆప్షన్ సభ్యులు గజానంద్, సీనియర్ అసిస్టెంట్ సురేశ్ చందర్ గౌడ్, ఏపీవో శివలింగం, టీఆర్ఎస్ నాయకులు గణేశ్ పాటిల్, సోలంకి భీంరావ్, రాంకుమార్ పాల్గొన్నారు.
లోకేశ్వరం, జూన్, 2 : మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, జీపీల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ లలి తా భోజన్న, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్, మండల ఉపాధ్యక్షుడు మా మిడి నారాయణ రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ కరిపే శ్యాంసుందర్, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, టీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు బండి ప్రశాంత్, తహసీల్దార్ సరిత, ఎస్ఐ సాయికుమార్, ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, డీటీ అశోక్, ఏవో గణేశ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఏఈవోలు, తహసీల్ కార్యాలయ సిబ్బంది, ఈజీఎస్ సిబ్బంది, కానిస్టేబుళ్లు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.
కుంటాల, జూన్, 2 : మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ ఖలీం జాతీయ జెండాను ఎగురవేశారు. మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎం పీపీ గజ్జారాం, జడ్పీటీసీ గంగామణి, గ్రామపంచాయతీల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నా రు. మిఠాయిలు పంచిపెట్టారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో నిర్వహించారు.
ముథోల్, జూన్, 2 : ముథోల్‌లోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీపీ అయేషా అఫ్రోజ్ ఖాన్, సర్పంచ్ రాజేందర్, ఎంఈవో మైసాజీ, ఏవో భాస్కర్, ఐసీడీఎస్ సీడీపీవో శ్రీమతి, సీఐ వినోద్ జెండాను ఆవిష్కరించారు. మాజీ పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు మగ్దూమ్, ఎంపీడీవో సురేశ్ బాబు, ఎంపీవో అమీర్‌ఖాన్, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
బాసర, జూన్ 2 : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మండలంలో ఘనంగా నిర్వహించారు. ట్రిపుల్‌ఐటీలో ఏవో రాజేశ్వర్‌రావు, సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఏఈవో సుదర్శన్‌గౌడ్, టీఆర్ఎస్ కార్యాలయంలో పట్టణాధ్యక్షుడు న ర్సింగ్‌రావు, ఆయా గ్రామపంచాయతీల్లో సర్పంచ్ లు, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జెండాను ఎగురవేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. స్వీట్లు పంచిపెట్టారు.
తానూర్, జూన్ 2 : మండలంలోని అన్ని జీపీలు, మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా రెపరెపలాడింది. తానూ ర్ సర్పంచ్ తాడేవార్ విఠల్, తహసీల్దార్ వెంకటరమణ, వైస్ ఎంపీపీ జెల్లావార్ చంద్రకాంత్, ఎస్ఐ శ్రీనివాస్, టీజీబీలో మేనేజర్ సుధీర్, పీహెచ్సీలో డాక్టర్ సురేశ్, పశువైద్య శాలలో డాక్టర్ గోపాల్ మహాజన్, రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారి సంఘవి, హంగిర్గా సొసైటీ కార్యాలయంలో చైర్మన్ నారాయణ్‌రావ్ పటేల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయు డు నల్ల మల్లన్న జాతీయ జెండా ఆవిష్కరించారు.
కుభీర్, మే 2 : ఎంపీపీ తూం లక్ష్మి, సర్పంచ్ పానాజీ మీరా, ఆయా శాఖల కార్యాలయాల్లో సంబంధిత అధికారులు, మార్కెట్లో చైర్మన్ కందుర్ సంతోష్, పీఏసీఎస్‌లో చైర్మన్ రేకుల గంగాచరణ్, ఎస్ఐ ఎండీ షరీఫ్ జాతీయ జెండా ను ఎగురవేశారు. అన్ని జీపీల్లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పాఠశాలల్లో హెచ్ఎం లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జడ్పీటీసీ అల్కాతాయి చౌహాన్, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్, పానాజీ విజయ్‌కుమార్, సంజయ్ చౌహాన్, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ఖానాపూర్ టౌన్, జూన్ 2 : ఖానాపూర్ పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రేఖానాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాలలు వేశారు. ఏఎంసీ కార్యాలయంలో చైర్మన్ పుప్పాల శంకర్, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అబ్దుల్ మోయిద్, మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అంకం రాజేందర్, ఆయా కార్యాలయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.
దస్తురాబాద్, జూన్ 2 : దస్తురాబాద్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు ఘనంగా జరిగాయి. ఆయా కార్యాలయాల్లో అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
కడెం, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మండలంలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీ య జెండాలను ఆవిష్కరించారు.
ఖానాపూర్ రూరల్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మండలంలో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీ య జెండాలను ఆవిష్కరించారు.