మందమర్రి జూన్ 2: యువతను ప్రోత్సహించేందుకే గ్రామాలకు సమీపంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నామని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. సారంగపల్లిలో గురువారం క్రీడా ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. శంకర్‌పల్లిలో ఎంపీపీ గుర్రం మంగ శ్రీనివాస్‌గౌడ్, ఎంపీడీవో శశికళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజ్‌కుమార్, కో ఆప్షన్ మెంబర్ నసీరుద్దీన్, ఎంపీవో బీరయ్య, ఏపీవో రజియా, టీఆర్ఎస్ నాయకులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, సంజీవరావు, కార్యకర్తలు తదితరులున్నారు.
జైపూర్, జూన్ 2 : మండలంలోని ముదిగుంటలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సౌజన్య, ఎంపీపీ గోదారి రమాదేవి, జడ్పీటీసీ మేడి సునీత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అరవిందరావు, వైస్ ఎంపీపీ రమేశ్, కో ఆప్షన్ జైనుద్దీన్, ఏఎంసీ ఉపాధ్యక్షుడు ఆర్నె సమ్మయ్య, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు బేతు తిరుపతిరెడ్డి, అధికారులు డీఆర్డీవో శేషాద్రి, తహసీల్దార్ మోహన్‌రెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, తదితరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంచిర్యాలటౌన్, జూన్ 2: పాతమంచిర్యాలలోని శ్రీలక్ష్మీనగర్, రాజీవ్‌నగర్, గర్మిళ్ల, సున్నంబట్టి వాడల్లో క్రీడాప్రాంగణాలను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేశ్‌గౌడ్, కమిషనర్ బాలకృష్ణ, టీపీవో సత్యనారాయణ, ఎంఈ మధూకర్, ఏఈ నర్సింహాస్వామి, కౌన్సిలర్లు పూదరి సునీత, సుధామల్ల హరికృష్ణ, తదితరులున్నారు.
హాజీపూర్, జూన్ 2 : మండలంలోని వేంపల్లి, ముల్కల్ల గ్రామాల్లో క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఓలపు శారద-రమేశ్, మంచాల శ్రీనివాస్, మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి వెంకటేశ్వర రావు, అప్పాసు రాంచందర్, మొగిళి తిరుపతి, మొగిళి సత్యం, చింతపండు సత్యం, దామోదర్, కుడుక సత్యం, సత్యం పాల్గొన్నారు.
బెల్లంపల్లి టౌన్, జూన్ 2 : మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేతతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు లావణ్య, కొక్కెర చంద్రశేఖర్, రాజనాల కమల, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ, మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత, నాయకులు కొమ్మెర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లిరూరల్, జూన్ 2: మండలంలోని చాకేపల్లి, కన్నాల గ్రామాల్లో మంజూరు చేసిన క్రీడా ప్రాంగణాలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, సర్పంచ్‌లు జంబి సురేశ్, జిల్లపల్లి స్వరూప, తాళ్లపల్లి అశోక్‌గౌడ్, ఎంపీటీసీ పీ సుభాష్‌రావు, ఎంపీడీవో డీ రాజేందర్, ఎంపీవో శ్రీనివాస్, ఈజీఎస్ ఏపీవో జీనత్, నియోజకవర్గ నాయకులు కొమ్మెర లక్ష్మణ్, టీఆర్ఎస్ నాయకులు వెంబడి సురేశ్, జిల్లపల్లి వెంకటస్వామి, గద్దల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
కాసిపేట, జూన్ 2 : కాసిపేట మండలంలోని ముత్యంపల్లిలో క్రీడా ప్రాంగాణాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రంరావు, సింగిల్ విండో చైర్మన్ నీలా రాంచందర్, ఎంపీడీవో ఎంఏ అలీం, తహసీల్దార్ దిలీప్ కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి, ఓసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతిరెడ్డి, సర్పంచ్ ఆడె బాదు, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, రైతు బంధు సమితి అధ్యక్షుడు దుర్గం పోశం, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచందర్, అక్కెపల్లి లక్ష్మి, మాజీ జడ్పీటీసీ రౌత్ సత్తయ్య, టీఆర్ఎస్ కార్యదర్శి మోటూరి వేణు, గ్రామ అధ్యక్షుడు అగ్గి సత్తయ్య, మద్దివేణి వేణు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మంజులారెడ్డి, వాసుదేవ్, బందెల ప్రేమ్‌కుమార్, వడ్లూరి మల్లేశ్, జాడి రాంచందర్, లంక లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
కన్నెపల్లి, జూన్ 2 : భీమిని మండలంలోని రాంపూర్, భీమిని గ్రామాల్లోని క్రీడా ప్రాంగణాలను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోతురాజుల రాజేశ్వరి, ఎంపీడీవో ఫణిందర్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నిరంజన్ గుప్తా, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
జన్నారం, జూన్ 2 : మండలంలోని కామన్పెల్లిలో గ్రామీణ క్రీడా మైదానాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇత్యాల కిషన్, ఎంపీపీ మాదాడి సరోజన, సర్పంచ్ పేరం మానస, శ్రీనివాస్, ఎంపీడీవో అరుణారాణి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, ఎంపీటీసీల పోరం జిల్లా ప్రెసిడెంట్ మహ్మద్ రియాజొద్దీన్, వైస్ ఎంపీపీ సుతారి వినయ్‌కుమార్, వైస్ చైర్మన్ సిటిమల భరత్‌కుమార్, జాడి గంగాధర్, గుర్రం గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.