నిర్మల్ అర్బన్, జూన్ 2: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, బడీడు పిల్లలను బడుల్లో చేర్పించడం, పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడమే లక్ష్యంగా అడుగులు వే స్తోంది. ఇందుకోసం నిర్మల్ జిల్లాలో శుక్రవారం నుంచి 30వ తేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని గ్రామాలు, మం డలాలు, పట్టణ ప్రాంతాలల్లో ఉదయం 7 గంటల నుంచి 11 గం టల వరకు గ్రామాల్లో తిరుగుతూ జూన్ 10వ తేదీ వరకు విద్యార్థులను పాఠశాలల్లో ఎన్రోల్ చేయించనున్నారు. నిర్మల్ జిల్లాలో మొత్తం 834 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇందులో 576 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 29,269 మంది వి ద్యార్థులు చదువుకుంటున్నారు. 90 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉండగా, వీటిలో 8833 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 168 ఉన్నత పాఠశాలలు ఉండగా, 38,487 మంది విద్యార్థులు చదువుతున్నారు..
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దింది. దీంతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులు ర్యాంకులు సాధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నా ణ్యమైన విద్యను అందించడంతో పాటు, సన్న బియ్యంతో కూడిన రుచికరమైన భోజనాన్ని అందించడంతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు దృష్టి సారించారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాలలు ప్రారంభమైన కొద్ది రోజులకే అడ్మిషన్లు ఫుల్ అంటూ బోర్డులను తగిలిస్తున్నారు. ఇది రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చెందిందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇక కేజీబీవీలు, గురుకుల పాఠశాలలు, మైనార్టీ రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. మన ఊరు..మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు విస్తృతం చేస్తూ, అదనపు తరగతులను నిర్మించడంతో పాటు ఇంగ్లి ష్ మీడియం విద్యావిధానం తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం పాఠశాలల ఉపాధ్యాయులకు విడుతల వారీగా ఇంగ్లిష్ మీడియం బోధించేందుకు శిక్షణను కూడా అందించారు. నిర్మల్ జిల్లాలో260 ప్రభుత్వ పాఠశాలలు మన ఊరు మన బడికి ఎంపికయ్యాయి. ఇప్పకే ఆయా పాఠశాలల్లో వివిధ పనులు నిర్వహిస్తున్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, ఇంగ్లిష్ మీడియం తరగతులతో వి ద్యార్థుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయని ఉపాద్యాయులు అభిప్రాయపడుతున్నారు.
నిర్మల్ జిల్లాలో శుక్రవారం నుంచి బడిబాట కార్యక్రమం ప్రారంభం కానుండగా.. ఈనెల 30 వరకు రోజుకో కార్యక్రమాన్ని విద్యాశాఖ అధికారులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు , ఉచిత పుస్తకాల పంపిణీ, ఉ చిత దుస్తుల పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఉన్నత వి ద్యకు అందివచ్చే అవకాశాలను విద్యార్థులకు వివరించనున్నారు.
నేటి నుంచి ప్రారంభమయ్యే బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా ని ర్వహిస్తాం. బడిబాట కార్యక్రమం ద్వా రా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను వివరించాలని ఉపాధ్యాయులకు సూచించాం. మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా ఇంగ్లిష్ మీడియం ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లాలో పెద్ద సంఖ్యలో ప్రభు త్వ పాఠశాలల్లో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో వివిధ సౌకర్యాలను కల్పిస్తున్నది.
-డీఈవో రవీందర్ రెడ్డి, నిర్మల్