నిర్మల్ టౌన్, జూన్ 2 : మత్స్యకారులకు జీవన భరోసా కల్పించి ప్రభుత్వం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీతో నీలి విప్లవాన్ని సృష్టిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యగార్డెన్ సమీపంలో రూ.కోటితో నిర్మించిన జిల్లా మత్స్యకార శిక్షణ భవనాన్ని ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మితో కలిసి గురువారం ప్రారంభించారు. నిర్మల్ జిల్లాలో సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం ద్వారా చేప పిల్లల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మల్‌లో రూ.50 లక్షలతో మత్స్య మార్కెటింగ్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, జిల్లా మత్స్యశాఖ అధికారి నర్సింహారావు, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నర్మదా ముత్యంరెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, మత్స్యకార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యువరాజ్, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, డీఈ తుకారాం, మత్స్య కార్మిక సంఘ నాయకులు భోజన్న, నర్సయ్య పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, జూన్ 2 : బాధ్యతగా విధులు నిర్వహిస్తేనే మంచి గుర్తింపు లభిస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వోగా ఉద్యోగోన్నతి పొందిన డాక్టర్ రాజేందర్ బుధవారం రాత్రి రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు. పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో ధన్‌రాజ్, డాక్టర్ శ్రీనివాస్ ఉన్నారు.
నిర్మల్ పట్టణంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో మొదటిసారిగా నిర్మల్ జిల్లాకు మం జూరైన పదో తరగతి మూల్యాంకన కేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. మూల్యాంకనాన్ని పకడ్బందీగా చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్లు రాంబాబు, హేమంత్ బోర్కడే, నిర్మ ల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, డీఈవో రవీందర్ రెడ్డి, సూపరింటెండెంట్ భోజన్న, పరీక్షల సహాయ క మిషనర్ సిద్ద పద్మ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
సారంగాపూర్, జూన్ 2 : తెలంగాణ ప్రభు త్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆలూర్ గ్రామంలో నిర్మించిన క్రీడా ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు. యువత ఆటలకు అలవాటు పడాలని, దీనిద్వారా గుట్కా, గంజాయి, సిగరెట్, మద్యపానం వంటి చెడు వ్యసనాలను దూరమవుతారని తెలిపారు.
అనంతరం వాలీబాల్ పోటీలను మంత్రి ప్రారంభించారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అడిషనల్ కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, జడ్పీసీఈవో సుధీర్‌బాబు, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లా వెంకట్రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వంగ రవీందర్‌రెడ్డి, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మాధవరావు, వైస్ ఎంపీపీ పతాని రాధ, సర్పంచ్ దండు రాధ, ఎంపీడీవో సరోజ, ఏవో రాజశేఖర్‌రెడ్డి, ఏఈ శ్రీనివాస్, ఎంపీవో తిరుపతిరెడ్డి. నాయకులు రాంకిషన్‌రెడ్డి, రాజ్‌మహ్మద్, దేవిశంకర్, దండు సాయికృష్ణ, లక్ష్మీనారాయణ, భూమేశ్, శ్రీనివాస్‌రెడ్డి, నర్సారెడి,్డ ఇస్మాయిల్, సాగర్‌రెడ్డి పాల్గొన్నారు.