ఎదులాపురం, జూన్ 2 : ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆర్అండ్బీ అతిథి గృహం ముందు అమరవీరుల స్తూపానికి, ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్లో జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్ నటరాజ్, మాజీ ఎంపీ నగేశ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ బంగ్గాలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఏఎస్పీలు, డీఎస్పీ, సీఐలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఎదులాపురం, జూన్ 2: జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో టీడీసీ పుప్పాల శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంవీఐ డీ శ్రీనివాస్, ఏఎంవీఐలు సురేశ్, మహేశ్, స్రవంతి, ప్రైవేట్ టూర్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రి పాల్గొన్నారు.
రిమ్స్‌లో తెలంగాణ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ జాతీయ జెండా ఎగురువేశారు. అలాగే సుందరయ్యనగర్‌లోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లలతో కలిసి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నారు.
జైనథ్, జూన్ 2 : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గోవర్ధన్, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రాఘవేంద్రరావు, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో వివేక్, ఐకేపీలో ఏపీఎం చంద్రశేఖర్, మార్కెట్లో కార్యదర్శి మధుకర్, జడ్పీఎస్హెచ్లో ప్రధానోపాధ్యాయుడు లస్మన్న, సర్పంచ్ దేవన్న జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
బేల, జూన్ 2 : మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వనిత ఠాక్రే, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ బడాల రాంరెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కృష్ణ కుమార్ , గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఇంద్రశేఖర్, ఐకేపీ కార్యాలయంలో ఏపీఎం రాజారెడ్డి, అటవీ శాఖ కార్యాలయంలో ఎఫ్ఆర్వో అరుణ, జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు గంభీర్ ఠాక్రే, ప్రమోద్‌రెడ్డి, తేజ్రావ్, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 2: మండలంలోని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 2 : మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ సోము, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ శోభాబాయి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నాగ్నాథ్, అటవీ శాఖ కార్యాలయంలో ఎఫ్ఆర్వో పాండునాయక్, సహకార సంఘం బ్యాంకులో చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, ఏఎంసీ కార్యాలయంలో చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు అంబేద్కర్ చౌక్‌లో సర్పంచ్ గాంధారి, జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు గోపాల్సింగ్తిలావత్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో రాథోడ్ గణేశ్, విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈ చంద్రశేఖర్, ఎంఈవో కార్యాలయంలో ఎంఈవో నారాయణ, మండలంలోని 28 గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో పుష్పలత, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, జడ్పీటీసీ పుష్పలత, వైస్ ఎంపీపీ గోపాల్‌సింగ్, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, ఆశాబాయి, ఇంద్రవెల్లి ఉపసర్పంచ్ గణేశ్తైహిరే, ఎంపీవో సంతోష్, ఈవో సంజీవరావ్, ఏపీవో జాదవ్ శ్రీనివాస్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్, జూన్ 2 : నార్నూర్, గాదిగూడ మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, గ్రామ పంచాయతీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో నార్నూర్ ఎంపీపీ కనక మోతుబాయి, గాదిగూడ ఎంపీపీ చంద్రకళారాజేశ్వర్, వైస్‌ఎంపీపీలు చంద్రశేఖర్, యోగేశ్, తహసీల్దార్లు లక్ష్మణ్, మోతీరాం, ఎంపీడీవోలు రమేశ్, రామేశ్వర్, ఏపీవోలు, నాయకులు పాల్గొన్నారు.