కడెం, జూన్ 2 : రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పేర్కొన్నారు. కడెంలోని క్రీడా ప్రాంగణాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. ప్రభుత్వం రూ.5 లక్షలతో గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. కడెం క్రీడా మైదానాన్ని అన్ని హంగులతో జిల్లాలోనే ప్రథమంగా తయారు చేసిన సర్పంచ్ కొండపురం అనూషా లక్ష్మణ్, ఎంపీపీ అలెగ్జాండర్‌ను అభినందించారు. సర్పంచ్ ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు.
అనంతరం ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, ఆత్మ చైర్మన్ కానూరి సతీశ్, తహసీల్దార్ గజానన్, ఎంపీడీవో లింబాద్రి, ఎంపీవో వెంకటేశ్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు వేణుగోపాల్, వైస్‌ఎంపీపీ శ్యాంసుందర్, ఏపీవో జయదేవ్, నాయకులు ఒర్సు వెంకటేశ్, హసీబ్, గౌసొద్దీన్, రమేశ్‌రావు, బోయిని మంగ, రమేశ్, అజ్మీరా శంకర్ నాయక్, పాకనాటి రాజేశ్వర్, మనోహర్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 2 : మండలంలోని ముత్నూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడామైదాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రారంభించారు. అనంతరం ముత్నూర్ గ్రామానికి చెందిన మహిళలు తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే.. ఫోన్ ద్వారా ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్ డోంగ్రే, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాంనాయక్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, తహసీల్దార్ సోము, ఎంపీడీవో పుష్పలత, ఎస్ఐ నందిగామ నాగ్నాథ్, ఎంపీవో సంతోష్, ఏపీవో జాదవ్ శ్రీనివాస్, ఎంపీటీసీలు జాదవ్ స్వర్ణలత, కోవ రాజేశ్వర్, సర్పంచ్‌లు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మండలంలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో ఇళ్ల పైకప్పులు లేచిపోయిన మోడిగూడ, పాకిడిగూడ గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే రేఖానాయక్ పరామర్శించారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనవంతుగా ఆదుకోవడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 2 : గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు.
మండలంలోని మత్తడిగూడ గ్రామంలో క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో వాలీబాల్ ఆడారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావ్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీరాం, సర్పంచ్ మడావి యశోద, ఎంపీడీవో తిరుమల, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు రషీద్ ఖాన్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అజీమొద్దీన్, కోల సత్తన్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షడు రమేశ్, జిల్లా నాయకుడు దాసండ్ల ప్రభాకర్, నాయకులు ప్రజ్ఞశీల్, రవి, ఆశన్న, బలవంత్, జుబేర్, గ్రామ పటేల్ సోనేరావ్ పాల్గొన్నారు.