పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నేటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే నాలుగు విడుతలుగా పల్లె, మూడు విడుతలుగా పట్టణ ప్రగతి దిగ్విజయం అయ్యాయి. సత్ఫలితాలు రావడంతో ఈనెల 18 వరకు కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నాలుగు మున్సిపాలిటీలు, 864 గ్రామ పంచాయతీల్లో నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కలెక్టర్లు, ఎమ్మెల్యేలు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహించి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొననున్నారు.
ఆదిలాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వం చేపడుతున్న పట్టణ, పల్లె ప్రగతి గ్రామాల్లో సత్ఫలితాలనిస్తున్నది. ఈ కార్యక్రమం ద్వారా గ్రా మాల్లో పచ్చదనం, పరిశుభ్రతలో ఆదర్శంగా మారా యి. గ్రామ పంచాయతీకో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీలను పంపిణీ చేశారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం 10 శాతం నిధులు పచ్చదనానికి వినియోగిస్తున్నారు. పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను ఏర్పాటు చేశారు.
ప్రతి పంచాయతీలో నర్సరీలను ఏర్పాటు చేసి ఇంటింటా ఆరు మొ క్కలు నాటేలా చర్యలు తీసుకున్నారు. పాడుబడ్డ ఇం డ్లు, బంగ్లాలు, బావులను కూల్చివేశారు. సర్కారు తు మ్మలు, ముళ్లపొదలను తొలగించారు. మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. సర్కారు తుమ్మలు, పెంట కుప్పలు పనికిరాని వాటిని తొలగించి గ్రామాలు పరిశుభ్రంగా కనిపించేలా చర్యలు తీసుకున్నారు. వంగిపోయి ప్ర మాదకరంగా మారిన విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేసి ఎల్ఈడీ బల్బులు పెట్టారు.
వేలాడుతున్న కరెంటు తీగలను సరిచేశారు. గ్రామాల్లోని ఖాళీ స్థలాలతో పాటు రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. ప్రతి పల్లెలో తడి, పొడి చెత్తను సేకరించడానికి ట్రై సైకిళ్లు అందించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుల తయారీ కోసం సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించారు. ఈ సారి చేపట్టబోయే పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా సీజనల్ వ్యా ధుల నివారణతో పాటు ఇతర పనులు చేపడుతారు.
పట్టణ ప్రగతి నాలుగో విడుత, పల్లె ప్రగతి ఐదో విడు త నేటి నుంచి ప్రారంభం కానుండగా, ఈ నెల 18 వరకు కొనసాగుతుంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 4 మున్సిపాలిటీలు, 864 గ్రామ పంచాయతీల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక మున్సిపాలిటీతో పాటు 468 గ్రామ పంచాయతీలు, నిర్మల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, 396 గ్రా మ పంచాయతీల్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నా రు.
ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పా ట్లు చేశారు. కలెక్టర్లు ఎమ్మెల్యేలు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమావేశాలు నిర్వహించి సలహాలు, సూచనలు అందజేశా రు. ఈ కార్యక్రమాల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొననున్నారు.