ఎదులాపురం,జూన్2: కక్షిదారుల సౌలభ్యం కోసమే కొ త్త కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ప్ర ధాన న్యాయమూర్తి ఎంఆర్. సునీత అన్నారు. తెలం గాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవం సందర్భంగా హైద రాబాద్లో సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీ ఎం కేసీఆర్ , తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్ర శర్మతో కలిసి 32 జిల్లాల్లో కొత్త కోర్టులు ప్రారంభించారు. ఇందులో భాగంగానే వర్చువల్ ద్వా రా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో కొత్త కోర్టులు ప్రా రంభమయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి ఎం ఆర్. సు నీత మాట్లాడుతూ.. ఇకపై ఏ జిల్లాకు సంబంధించిన క క్షిదారులు అ జిల్లాలో న్యాయం పొందే అవకా శం ఏర్ప డిందన్నారు. న్యాయమూర్తులు మాధవీకృష్ణ, సతీశ్ కు మార్, ఉదయ్ భాస్కర్రావు, యశ్వంత్ సింగ్ చౌహాన్, మంజుల, డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్పాం డే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రల నగేశ్ ఉన్నారు.