దిలావర్పూర్. జూన్ 2 : గ్రామీణుల కోసమే క్రీడామైదానాలు ఏర్పాటు చేస్తున్నామని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. దిలావర్పూర్లో ఏర్పాటు చేసిన క్రీడామైదానాన్ని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గురువారం ప్రారంభించారు. జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, సర్పంచ్ వీరేశ్‌కుమార్, ఎంపీపీ పాల్ధే అక్షర, తహసీల్దార్ కరీం, ఎంపీడీవో మోహన్, ఎంపీవో అజీజ్‌ఖాన్, మండల కో ఆప్షన్ సభ్యుడు అన్వర్‌ఖాన్, పంచాయతీ ఈవో చంద్రశేఖర్, అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
భైంసా టౌన్, జూన్ 2 : మండలంలోని వానల్పాడ్, వాటోలి గ్రామాల్లో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి క్రీడాకారుల్లోని ప్రతిభను వెలుగులోకి తీసుకరావాలనే లక్ష్యంతోనే ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాటోలి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి లబ్ధిదారులైన జాదవ్ భో జాబాయి, కోటగిరి శశికళ, జాదవ్ కల్పన, మేశెట్టి సావిత్రా బాయి, భోజో ల్ల ముక్తవ్వకు చెక్కులను పంపిణీ చేశారు. ఇటీవల ఉత్తమ కార్యదర్శిగా ఎం పికైన అనితకు కలెక్టర్, ఎమ్మెల్యే ప్రశంసా పత్రా న్ని అందజేశారు. పెండింగ్ పెన్షన్లు త్వరలో మం జూరయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీ సీఈవో సుధీర్ బాబు, ఆర్డీవో లోకేశ్వర్ రావు, తహసీల్దార్ సూర్యప్రకాశ్, ఎంపీపీ కల్పన జాదవ్, వానల్పా డ్ సర్పంచ్ మాన్కుర్ పెద్ద రాజన్న, వాటోలి స ర్పంచ్ జాదవ్ నిఖిత, ఎంపీడీవో గంగాధర్, ఎం పీవో మోజామ్ హుస్సేన్, నాయకులు రాంకుమా ర్, గణేశ్ పాటిల్, సోలంకి భీంరావ్, సచిన్ పటేల్, మేరాజ్, ఉప సర్పంచ్ ఈశ్వర్ దగ్డే, మండల కా ర్యదర్శులు, వైస్ ఎంపీపీ గంగాధర్ పాల్గొన్నారు.
తానూర్, జూన్ 2 : మండలంలోని ఉమ్రి(కే) గ్రామంలో క్రీడా మైదానాన్ని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రారంభించారు. గ్రామస్తులు ఎమ్మెల్యేను సన్మానించారు. సర్పంచ్ పావలే రత్నమాల,హంగిర్గా సోసైటీ చైర్మెన్ నారాయన్రావ్పటేల్, వైస్ ఎంపీపీ జెల్లావార్ చంద్రకాంత్, ఆత్మ చైర్మెన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోతరెడ్డి, మాజీ ఎంపీపీ బాశె ట్టి రాజన్న, చంద్రకాంత్యాదవ్, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీవో గోపాలకృష్ణరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.