బెజ్జూర్, జూన్ 1 : ఐదో విడుత పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సూచించారు. మండల కేంద్రంలోని రైతువేదికలో బుధవారం నిర్వహించిన మండల సర్వ సభ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముం దుగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రాధాన్యత గల శానిటేషన్, పారిశుధ్యం ఆరోగ్యం, చదువు తదితర పనులపై సర్పంచ్‌లు దృష్టి సారించాలనిసూచించారు. ఇందుకోసం ఈ నెల 3 నుంచి పల్లె ప్రగతి కార్యక్రమాలపై గ్రామ సభలు ఏర్పాటు చేసి చేపట్టాల్సిన పనులను ఎంపిక చేసుకోవాలన్నా రు.
అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం మండల ప్రత్యేకాధికారి సురేశ్ బాబు మాట్లాడుతూ పల్లె ప్రగతి గ్రామ సభల్లో విద్యుత్ శాఖ, అటవీ శాఖలతో పాటు ఆయా శాఖల ప్రతినిధులు, భాగస్వాములయ్యేలా మండల ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం తహసీల్దార్ రఘునాథ్ మాట్లాడుతూ క్రీడా మైదానాల కోసం స్థలాల ఎంపికపై అటవీ శాఖ అధికారులకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. స్పందించిన రేంజ్ అధికారి దయాకర్ అటవీ భూము ల్లో ప్రకృతి వనాలకు తమ ఆధీనంలో గల ఎలాంటి భూములైనా ఇచ్చేందుకు సిద్ధమని, క్రీడా మైదానాలకు మాత్రం ఇవ్వలేమని తేల్చి చెప్పారు.
రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు గెజిట్లతో పరిష్కారంతో క్రీడా మైదానాల స్థలాలు కేటాయింపులు జరుగనున్నాయని తెలిపారు. అనంతరం వ్యవసాయ శాఖలో వాటర్ షెడ్ పథకంలో కాటెపల్లి, కుకుడ, కుశ్నపల్లి, సుస్మీర్, పోతెపల్లి గ్రామాల్లోని రైతులకు 75 శాతం రాయితీపై వ్యవసాయ పనిముట్ల కోసం డీడీలు తీసి సం బంధిత వ్యవసాయ విస్తరణాధికారులకు అందించాలని సూచించారు. రైతు భీమా కింద ఇప్పటివరకు రూ. 1 50 లక్షలను అందించామని, పచ్చిరొట్టె ప్రయోగం ద్వారా 20 ఎకరాలు సాగును చేపట్టామని ఏఈవో రవితేజ చెప్పారు. విద్యుత్ సమస్యలు రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా చేపట్టే పనులకు వినియెగదారులు సహకరించాలని ఏఈ బాలకృష్ణ కోరారు.
ఈ నెల 3 నుంచి 30 వరకు బడి బాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంఈవో రమేశ్ బాబు తెలిపారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద 17 పాఠశాలలు మంజూరైనట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో అంబాగట్ గ్రామంలో అం తర్గం పైపు కనెక్షన్ ఇవ్వలేదని తద్వారా నీటి సరఫరా కావడంలేదని డీఈ అభిలాష్‌ను సర్పంచ్ తిరుపతి నిలదీశారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామని అధికారి సమాధానం ఇ చ్చారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వంతోనే అభివృద్ధికి కృషి చేయాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశా రు.
ఎంపీడీవో మాధవి, జడ్పీటీసీ పంద్రం పుష్పలత, సహకార సంఘం చైర్మన్ కుర్సింగ ఓంప్రకాశ్, ఎంపీవో వీర భద్రయ్య, మిషన్ భగీరథ డీఈ సిద్ధిఖీ, ఏఈ పృద్వీరాజ్, ఏపీవో గోవర్ధన్ సింగ్, ఏపీఎం తిరుపతి, కో-ఆప్షన్ సభ్యుడు బషారత్ ఖాన్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.