ఇంద్రవెల్లి, జూన్ 1 : గ్రామీణ ప్రాంతంలోని యువత ప్రతిభ ను వెలికితీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం మైదానాలను ఏర్పాటు చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలంలోని ముత్నూర్, దస్నాపూర్ గ్రామపంచాయతీల పరిధిలో ఏర్పాటు చేస్తున్న క్రీడామైదానాలను బుధవారం సాయంత్రం ఆమె పరిశీలించారు. అక్కడ చేపడుతున్న పనుల గురించి అధికారులను ఆడిగి తెలుసుకున్నారు.
గ్రామాల్లో యువత కోసం క్రీడామైదానాలు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా మైదానాలు ఏర్పాటు చేస్తున్నదన్నారు. ఈ మైదానాల్లో యువత అన్ని ఆటలు ఆడుకోవచ్చని తెలిపారు. ఆటలతో మానసికోల్లాసం కలుగుతుందని, నైపుణ్యం పెంచుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోనూ రాణించవచ్చని సూచించారు. ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీరాం నాయక్, మాజీ జడ్పీటీసీ దేవ్పూజే సంగీత, ఎంపీటీసీ జాదవ్ స్వర్ణలత, సర్పంచ్లు తుంరం భాగుబాయి, రాథోడ్ శారద, ఎంపీవో సంతోష్, టీఆర్ఎస్ నాయకులు దేవ్పూజే మారుతి, దేవేందర్, ఈజీఎస్ అధికారులు పాల్గొన్నారు.