ఆసిఫాబాద్,మే 30 : ఆంగ్లభాషపై ఉపాధ్యాయులు పట్టు సాధించాలని అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డి సూచించారు. జిల్లాకేంద్రంలోని ఆశ్రమోన్నత పాఠశాలలో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు ఆంగ్లభాషపై ఇస్తున్న వృత్యంతర శిక్షణ తరగతులను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన అంశాలపై నైపుణ్యం సాధించాలన్నారు.
ప్రస్తుతం తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించాలన్న డిమాండ్ ఉందని, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి తెలుగు మాధ్యమం నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి మా ర్పు చేసేందుకు నిర్ణయించిందన్నారు. ఈ మేరకు ఉపాధ్యాయులను సంసిద్ధత చేసేందుకు ఐదు రోజుల శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో డీడీ మణెమ్మ, ఏసీఎంవో ఉద్దవ్, సెంటర్ కన్వీనర్ వామన్రావు, కో కన్వీనర్ జయంతి, ధ ర్మారావు, శ్రీనివాస్, రిసోర్స్ పర్సన్స్ ప్రీతి, శైలజ, అవంతి, కైలాస్, మనోహర్ ఉన్నారు.
కెరమెరి, మే 30 : మండలంలోని హట్టి ఆశ్రమోన్నత పాఠశాలలో ఎంపీపీ పెందోర్ మోతీరాం, జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి ఆంగ్ల బోధన శిక్షణ తరగతులను ఎస్ఐ లావణ్యతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
ఉపాధ్యాయులు వారికి మెరుగైన విద్యనందించేందుకు సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో ఏటీడీవో పురుషోత్తం, కోర్స్ కన్వీనర్ ప్రేందాస్, కోకన్వీనర్ ఆత్రం పంచఫులాబాయి, కేఆర్పీ మహేశ్వర్, శిక్షకులు (ట్రైనర్స్) చైతన్య, మనోహర్, రాజేశ్, నాణేశ్వర్తో పాటు 45 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తిర్యాణి:మే 30: ఉపాధ్యాయులు ఆగ్ల బోధనకు సన్నద్ధం కావాలని ఏటీడీవో క్షేత్రయ్య అన్నారు. తిర్యాణి, రోంపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లోని సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులకు ఐదు రోజుల ఆంగ్ల భాష అభివృద్ధి, వృ త్యంతర శిక్షణ తరగతులను సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి గుణవంతరావుతో కలిసి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో శిక్షకులు శ్రీనివాస, వెంకటేశ్వర్లు, రాజేంద్ర ప్రసాద్, శిక్షణ కేంద్ర నిర్వామకులు మడావి షేక్, గోపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జైనూర్ ,మే 30: మండలకేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ పార్వతీలక్ష్మణ్, శిక్షణ కన్వీనర్ అనిత, కో కన్వీనర్ సోనేరావ్, గజానంద్, టీచర్లు పాల్గొన్నారు.