ఎదులాపురం, మే 29 : అనధికార ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. పట్టణం లోని సంజ య్నగర్, ఖుర్షిద్‌నగర్, హమాలీవాడల్లో ప్రత్యేక బృందాలు నిర్వహించిన సర్వేను ఆదివారం కలెక్ట ర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు 58,59 ఉత్తర్వుల ప్రకారం అనధికార ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సర్వేను సమర్థవంతంగా నిర్వహిం చాలని సూచించారు.
ఇంటి యజమానులకు ముందస్తు సమాచారం అందించి, ఇంటి స్థలాల కొలతలు సేకరించడంతో పాటు పూర్తి వివరాలను అన్లైన్ యాప్‌లో పొందుపర్చాలన్నారు. ప్రభు త్వం ఉద్యోగుల ఇంటి స్థలాలను 58 ఉత్తర్వుల ప్రకారం సర్వే చేపట్టవద్దని సూచించారు. మున్సి పల్, రెవెన్యూ సిబ్బంది సహకారంతో యజమా నికి సమాచారాన్ని అందించాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఖాళీ స్థలాలను తిరస్కరించాలని, దరఖాస్తుల వారీగా రిజిస్టర్లో తప్పని సరిగా నమోదు చేయాలని సూచించారు.
ప్రత్యేకాధికారులు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ పద్మభూషణ్‌రాజు, భూ కొలతల సహాయ సంచాలకులు రాజేందర్, పట్టణ తహసీల్దార్ సతీశ్, ఇతర రెవెన్యూ, మున్సి పల్ అధికారులు పాల్గొన్నారు. కాగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పార్ట్‌టైం, డెయిలీ వైస్ వర్కర్లకు వేతనాలు పెంచినందుకు తెలంగాణ ప్రభుత్వ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ నాల్గో తరగ తి ఉద్యోగుల సంఘం నాయకులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సిక్తా పట్నా యక్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సౌకత్ హుస్సేన్, ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడు కేబీసీ నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సిడాం శ్రీనివాస్, సభ్యు లు కనక కమల, రాము, లక్ష్మి, సోనేరావు తదితరులు పాల్గొన్నారు.
భైంసా, మే 29 : ప్రభుత్వ నిబంధనల మేరకు అనధికార ఇంటి స్థలాల క్రమబద్ధ్దీకరణ సర్వేను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదివారం భైంసాలోని ఏపీనగర్, గోపాల్ నగర్, ఓవైసీనగర్ లో ఇంటింటికీ వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం జారీ చేసిన 58, 59 జీవో ప్రకారం సర్వే నిర్వహించా లని, ఇంటి యజమాని అనధికారికంగా నిర్మించి న భవనాలు, కొలతలు సేకరించడంతోపాటు పూర్తి వివరాలను సేకరించి ఆన్లైన్ యాప్‌లో పొందుపర్చాలన్నారు. ఆర్డీవో లోకేశ్వర్‌రావు, కాలనీ వాసులు, తదితరులు ఉన్నారు.