సోన్, మే 28 : మండల కేంద్రంలోని జడ్పీ హెచ్ఎస్ ఉన్నత పాఠశాల, లెఫ్ట్ పోచంపాడ్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగిన పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. వారం రోజుల క్రితం ప్రారంభమైన పరీక్షలకు విద్యార్థులు వందశాతం హాజరైనట్లు చీఫ్ సూపరింటెండెంట్ విజయ్‌కుమార్, పరమే శ్వర్ తెలిపారు. విద్యార్థులు సంతోషంతో బయట కు వచ్చి ఆప్యాయంగా పలకరించుకున్నారు.
కడెం, మే 28 : కడెంతోపాటు, మద్దిపడగ, బీర్నంది, కడెం కేజీబీవీ, జీయర్ గురుకులం అల్లంపల్లి, నచ్చన్ ఎల్లాపూర్ గురుకుల పాఠశాల లకు చెందిన 281 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. శనివారం చివరి రోజు 275 మంది పరీక్షలు రాసినట్లు చీఫ్ సూపరింటెండెం ట్ ఎం శ్రీనివాస్, డిపార్ట్మెంట్ అధికారి బీ ఈశ్వర్ తెలిపారు. మరో ఆరుగురు గైర్హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశా యని, అలాగే జూన్ 1న కడెం జడ్పీ పాఠశాలకు చెందిన 108 మంది విద్యార్థులకు ఒకేషనల్ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
తానూర్, మే 28 : మండల కేంద్రంతోపాటు ఎల్వీ, భోసి పరీక్షా కేంద్రాల్లో జరిగిన పది పరీక్షలు శనివారం ముగిశాయి. అనంతరం విద్యార్థులు ఆనందంతో ఇంటిబాట పట్టారు. విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు.
ముథోల్, మే 28 : ముథోల్‌లో పది పరీక్షలు ముగిశాయి. చివరి రోజు విద్యార్థులు పరీక్షలు రాసి ఉత్సాహాంగా బయటకు వచ్చి కేరింతలు కొట్టారు. పరీక్షలు బాగా రాసినట్లు తెలిపారు. విద్యార్థులు ఇండ్లకు బయలుదేరి వెళ్లారు.
దస్తురాబాద్, మే 28 : మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పది పరీక్షలు ముగిశా యని డిప్యూటీ తహసీల్దార్ శివకుమార్, చీఫ్ సూపరింటెండెంట్ రాజేశ్వర్ గౌడ్, డీవో డీఎల్ ఎన్ చారి తెలిపారు. ఆరు రోజుల నుంచి జరిగిన పది పరీక్షలు శనివారం ముగిశాయి. విద్యార్థులు సంతోషంగా ఇంటిబాట పట్టారు.