శ్రీరాంపూర్, మే 28 : కోల్‌బెల్ట్ నస్పూర్, శ్రీరాంపూర్ సింగరేణి ప్రాంతంలో 40 ఏళ్లుగా నివాసముంటున్న ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని, రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కే పట్టం కటాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. శనివారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు వాటర్ ట్యాంక్ ఏరియా నివాసం ఉంటున్న 179 మందికి ఇండ్ల స్థలాల పట్టాలను మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్, తహసీల్దార్ జ్యోతితో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వారానికోసారి వచ్చి పోయేవారు, పవ్వా, చీర ఇచ్చి ఓటు వేయమని అడిగే వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దని కోరారు.
నియోజక వర్గం ఒక అవినీతి పరుల చేతిలోకి పోరాదన్నారు. తెలంగాణా ప్రభుత్వం ఇస్తున్న ఇండ్ల స్థలాల పట్టాలు లక్షల విలువ చేస్తాయని చెప్పారు. తెలంగాణాలో ప్రతి ఇంటికీ ఏదో ఒక ప్రభుత్వ పథకాన్ని అందించామని చెప్పారు. ఒక్కొక్కరింట్లో రెండు కల్యాణ లక్షి పథకాలతో రూ.2 లక్షల రూపాయలు లబ్ధి పొందిన వారున్నారని, అలాంటి వారు సీఎం కేసీఆర్‌ను మరిచి పోరాదని కోరారు. ఇండ్ల స్థలాల పట్టాలు పొందుతున్న వారు ప్రతి ఒక్కరూ ముడు అంతస్తుల బంగ్లాలు కట్టుకోవచ్చన్నారు.
సింగరేణి ప్రాంత వాసులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పట్టాల కల నెరవేరిందన్నారు. మిగిలిన వారికి కూడా పట్టాలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కురి సుబ్బయ్య, కౌన్సిలర్లు బండి పద్మ, బెడిక లక్షి, పంబాల గంగాఎర్రయ్య, బౌతు లక్షి, పూదరి కుమార్, బోయ మల్లయ్య, బేర సత్యనారాయణ, వంగ తిరుపతి, నాయకులు జక్కుల రాజేశం, గుంట జగ్గయ్య, మహేందర్, చెల్ల విక్రం, ప్రశాంత్, బండి తిరుపతి, రాజేంద్రపాణి, రఫీఖ్ఖాన్, పెర్క సత్యనారాయణ, ప్రవీణ్ పాల్గొన్నారు.
– కోటి 20 లక్షలు అందించిన దాతలు
మంచిర్యాలటౌన్, మే 28: మంచిర్యాల పట్టణంలో గోదావరి నది తీరాన వైకుంఠధామం ఏర్పాటుకోసం అవసరమైన ఎకరం నాలుగు గుంటల స్థలాన్ని దాతల సహకారంతో రూ. 1.20 కోట్లను వెచ్చించి కొనుగోలు చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు వెల్లడించారు. శనివారం సాయంత్రం మంచిర్యాలలోని ఎం కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు, దాతలతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పదేళ్ల క్రితం వ్యాపారవేత్త గుండా సుధాకర్ శ్మశాన వాటికకు స్థలం ఇచ్చి శ్మశాన వాటికను ఏర్పాటుచేశారని గుర్తు చేశారు. పట్టణంలో రాజీవ్‌నగర్, అండాలమ్మనగర్, పాత మంచిర్యాల, తిలక్‌నగర్ వద్ద శ్మశానవాటికలు ఉన్నప్పటికీ గోదావరి నదీతీరాన శ్మశాన వాటిక ఉంటే బాగుంటుదని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ స్థలం లేనందున, భూమి ఇచ్చేవారి కోసం ఎదురుచూశామని, ఎవరూ ముందుకు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎకరం నాలుగు గుంటల భూమిని కొనుగోలు రూ. 1.20 కోట్లతో భూమిని కొన్నామని తెలిపారు.
అత్యాధునిక పద్ధతిలో వైకుంఠధామాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ భూమిని 75 మంది దాతలు విరాళంతో కొన్నట్లు తెలిపారు. వారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేశ్‌గౌడ్, కౌన్సిలర్లు బోరిగం శ్రీనివాస్, సురేశ్‌బల్దవా, గాదెసత్యం, టీఆర్ఎస్ నాయకులు విజిత్‌కుమార్, మామిడిశెట్టి రమేశ్, బోరిగం రాజారాం, పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.