బోథ్, మే 28: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేద విద్యార్థులు చదువుకునే పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ‘ మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని చేపట్టిందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. బోథ్‌లోని జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో రూ. 44.29 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు.
విద్యుత్ శాఖ తరఫున తొమ్మిది కుటుంబాలకు నష్ట పరిహారం కింద మంజూరైన రూ.8,88,000 విలువైన చెక్కులు అందజేశారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, టీఆర్ఎస్ మండల కన్వీనర్ రుక్మాణ్‌సింగ్, సర్పంచ్ సురేందర్‌యాదవ్, ఆత్మ చైర్మన్ ఎం సుభాష్, రైతు బంధు సమితి అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, ఎంపీటీసీలు డీ నారాయణరెడ్డి, చట్ల ఉమేశ్, తహసీల్దార్ అతిఖొద్దీన్, నాయబ్ తహసీల్దార్ రాథోడ్ ప్రకాశ్, ఏడీఈ సుబ్రహ్మణ్యం, ఏఈఈ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
తాంసి, మే 28 : పాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని ఎంఈవో శ్రీకాంత్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన ఊరు-మన బడి పనులు సర్పంచ్ స్వప్న రత్నప్రకాశ్తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వన్నెల నరేశ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్‌కుమార్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు కంది గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ గంగారాం, ఉపసర్పంచ్ సంతోష్‌రెడ్డి పాల్గొన్నారు.