కడెం, మే 27 : గ్రామీణ ప్రాంత యువతను క్రీడాల్లో రాణించేలా ప్రభుత్వం అయా గ్రామాల్లో మైదానాలను సిద్ధం చేస్తున్నట్లు నిర్మల్ డీఆర్డీవో విజయలక్ష్మి పేర్కొన్నారు. పెద్దబెల్లాల్, కడెం, నచ్చన్ఎల్లాపూర్ గ్రామాల్లో క్రీడా స్థలాలను ఆమె శుక్రవారం పరిశీలించారు. పెద్దబెల్లాల్ పంచా యతీలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీకి అనుకూ లమైన క్రీడా స్థలాన్ని ఎంపిక చేసి ముగ్గు పోశారు. అనంతరం కడెం, నచ్చన్ఎల్లాపూర్ గ్రామాల్లో క్రీడ స్థలాలను పరిశీలించారు. అనంతరం నర్సరీ, ఇతర అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మండలం లో మొదటి విడుత కింద ఐదు క్రీడా స్థలాలను ఎంపిక చేస్తున్నామని పేర్కొన్నారు. జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సర్పంచ్లు రమాదేవి, అనూష, బొడ్డు గంగన్న, ఎంపీవో వెంకటేశ్, ఈజీఎస్ ఏపీవో జయదేవ్, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు, తదితరులున్నారు.
సారంగాపూర్, మే 27 : జామ్ గ్రామంలో క్రీడా మైదాన పనులను ఎంపీడీవో సరోజ పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారుల్లో నైపుణ్యం వెలికీ తీయడానికే మైదానాలు నిర్మిస్తున్నదని పేర్కొన్నా రు. క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్పంచ్ మహిపాల్ మురళీకృష్ణ, ఎంపీటీసీ వనజ, ఉపసర్పంచ్ విలాస్, పంచా యతీ కార్యదర్శి అశోక్ మహేశ్ పాల్గొన్నారు.
దస్తురాబాద్, మే 27 : గొడిసెర్యాల, బుట్టా పూర్ తదితర గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పా టుకు స్థలాలను ఎంపీడీవో వెంకటేశ్వర్లు పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గ్రామాల్లో మైదానాల పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉప సర్పంచ్ మణిక్ రావు,ఎంపీవో అనిల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సౌమ్య, తదితరులున్నారు.
పెంబి, మే 27: పెంబి, మందపల్లి, ఇటిక్యాల, పస్పుల గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు తహసీల్దార్ అడ్ప శ్రీధర్, ఎంపీడీవో లింబాద్రి స్థలాలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే నెలలో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికి అన్ని గ్రామాల్లో క్రీడాప్రాంగాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుం టున్నట్లు తెలిపారు. క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో చిక్యాల రత్నాకర్ రావు, సర్పంచ్లు, రెవేన్యూ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.