ఆదిలాబాద్ టౌన్, మే 27 : సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నారని ఆదిలాబాద్ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నా రు. ఆదిలాబాద్ రూరల్ మండలం కచ్చికంటి గ్రామంలో మార్కండేయ స్వామి ఆలయం, కల్యాణ మండప నిర్మాణానికి శుక్రవారం నాయ కులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆదిలా బాద్ నియోజకవర్గంలో రూ.10 కోట్లతో అనేక ఆలయాల నిర్మాణాలు చేపట్టామని పేర్కొన్నారు. కొంతమంది నాయకులు మాత్రం దేవుళ్ల పేర్లతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలన్నా రు. ఎంపీపీ లక్ష్మీజగదీశ్, వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, నాయకులు మెట్టు ప్రహ్లాద్, జిట్ట రమేశ్, దాసరి ఆశన్న, పరమేశ్వర్ పాల్గొన్నారు.
జైనథ్, మే 27 : మండలంలోని పార్డి గ్రామం లో దత్త మందిరంలో యజ్ఞం, హోమం నిర్వ హించారు. ఎమ్మెల్యే జోగు రామన్న ప్రత్యేక పూజ లు చేశారు. తన వంతుగా ఆలయ కమిటీకి రూ.లక్ష అందజేశారు. ప్రజాప్రతినిధులు, గ్రామ స్తులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించా రు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్రెడ్డి, ఎంపీటీసీ పెందుర్ దేవన్న, సర్పంచ్ పెందుర్ రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, మే 27 : మావలలో ముదిరాజ్ కులసంఘం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జోగు రామన్న భూమిపూజ చేసి పను లు ప్రారంభించారు. జడ్పీటీసీ వనిత, ఎంపీపీ చందాల ఈశ్వరీ, సర్పంచ్ ప్రమీళ, నాయ కులు నల్లా రాజేశ్వర్, చందాల రాజన్న, దొగ్గలి రాజేశ్వ ర్, గంగారెడ్డి, మహేందర్ రెడ్డి, వేణుగోపాల్, సురేందర్, రవి, ఉమాకాంత్రెడ్డి పాల్గొన్నారు.